
Mumbai, April 15: మహారాష్ట్రలో దారుణం (Mumbai Shocker) చోటు చేసుకుంది. ఆర్థిక రాజధాని మంబైలోని థానేలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తనకు టీతో పాటు టిఫెన్ పెట్టలేదని కోడలిని తుఫాకితో (Man Allegedly Fires At Daughter-In-Law) కాల్చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)కు అతని కోడలు గురువారం ఉదయం టీ అందించింది. అయితే, టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వాలని తెలియదా ( Not Getting Breakfast With Tea) అంటూ రెచ్చిపోయిన ఆ పెద్ద మనిషి బాధితురాలి (42)పై మాటలతో విరుచుకుపడ్డాడు.
అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. బాధితురాలి పొట్ట భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కళ్లముందే ఘోరం జరగడంతో నిశ్చేష్టులైన కుటుంబ సభ్యులు గాయాలపాలైన ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తోడి కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కాశీనాథ్‌పై కేసు నమోదు చేశామని థానే సీనియర్ పోలీస్ అధికారి సంతోష్ ఘటేకర్ తెలిపారు. ఘటనకు మరేదైన కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
నిందితుడు కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) మరియు 506 (నేరపూరిత బెదిరింపు) అలాగే ఆయుధ చట్టం కింద నేరం నమోదు చేసినట్లు సీనియర్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ ఘటేకర్ తెలిపారు. అతన్ని అరెస్టు చేశారు.