Woman assaults traffic cop. (Photo Credits: Twitter)

Mumbai, October 24: ముంబైలోని కల్పతా దేవి వద్ద ఒక యువతి ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడికి (Woman Assaults Traffic Police) దిగింది. అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసుపై ఆ మహిళ దాడికి దిగింది. ఇది సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మసీద్‌ బండార్ ప్రాంతానికి చెందిన సంగ్రికా తివారీ, భేండీ బజార్‌కు చెందిన మెహ్‌సిన్‌ షేక్‌లు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఓ పని మీద స్కూటీపై బయటకు వెళ్లారు. ఆ సమయంలో స్కూటీ నడుపుతున్న మొహ్‌సిన్‌కు హెల్మెట్‌ లేదు.

ద్విచక్ర వాహనం కాల్దాదేవీ ఏరియాలోని సూర్తీ హోటల్‌ వద్దకు రాగానే ట్రాఫిక్‌ పోలీస్‌ ఏక్తా పర్తే వారి వాహనాన్ని ఆపుచేశారు. హెల్మెల్‌ ధరించనందుకు ఫైన్‌ వేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మహిళలకు, అధికారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన సంగ్రికా.. అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటూ ట్రాఫిక్‌ పోలీసు చొక్కా పట్టుకుని దాడికి (Mumbai Traffic Police Beaten by Woman) దిగింది.

బట్టలిప్పింది, రూ. 1.25 లక్షలు కాజేసింది, హానీ ట్రాప్‌ వలలో చిక్కుకుని మోసపోయిన గుజరాత్ వైద్యుడు, ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Here's Video

విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ శాంతించని సంగ్రికా ఓ మహిళా పోలీసుపై కూడా చెయ్యి చేసుకోవటానికి ప్రయత్నించింది. దీంతో ఇద్దరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసినందుకు గానూ వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహిళపై పలు రకాల సెక్షన్ల కింద 571/2020 IPC 353, 332, 504, 506, 34 కింద కేసు నమోదు చేశారు.