Finger Found in Ice Cream.jpg

Mystery behind Finger Found in Ice Cream Solved: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న ఐస్‌క్రీంలో మనిషి వేలు కనిపించడం సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ఐస్‌క్రీంలో వచ్చిన వేలు పూణెలోని ఫార్ట్యూన్ కంపెనీ అసిస్టెంట్ ఆపరేటర్ మేనేజర్ ఓంకార్ పోటేదిగా గుర్తించారు. డీఎన్ఏ పరీక్షలో దీనిని ధ్రువీకరించడం జరిగింది. మే 11న ఐస్‌క్రీం ప్యాక్ చేస్తున్న సమయంలో ఓంకార్ తన కుడిచేయి మధ్యవేలిని ప్రమాదవశాత్తు కోల్పోయాడు.

అది ఆ ఐస్ క్రీం ప్యాక్ లోకి వెళ్లిపోయింది. ఐస్‌క్రీం కోన్ తయారీ తేదీ దీనితో సరిపోలుతోంది. పూర్తిగా నిర్ధారణ చేసుకున్న అనంతరం పోలీసులు ఫార్ట్యూన్ కంపెనీపై నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేసు నమోదు చేశారు. మహిళ ఆర్డర్ చేసిన ఐస్ క్రీంలో పురుషుని ఆ పార్టు, నోట్లో పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ, పోలీసులకు ఫిర్యాదు

జూన్ 12న ముంబైలోని మలాద్‌కు చెందిన 26 ఏళ్ల డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ తన సోదరి ఆన్‌లైన్‌లో తెప్పించిన బటర్‌స్కాచ్ ఐస్‌క్రీంను తింటుండగా మనిషి వేలు దర్శనమిచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం ఐస్‌క్రీంలో వచ్చిన వేలు ఎవరిదన్న విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు.