Chennai, August 3: కేంద్ర సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన నూతన జాతీయ విధానం(NPE)పై తమిళనాడు సర్కారు (Taminadu Govt) అసహనం వ్యక్తంచేసింది. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలోని ‘త్రి భాషా సూత్రా’న్ని (3 Language Formula) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి పళని స్వామి (Edappadi Karuppa Palaniswami) ప్రకటించారు. ఈ విధానం తమకు అత్యంత బాధా, విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విధానాన్ని ఎంత మాత్రమూ అమలు చేయమని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియానికే కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ,యూకేజీ విద్య అమలు, మీడియాతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
నూతన జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని పునఃపరిశీలించాలని ప్రధాన నరేంద్రమోదీకి (PM Modi) సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ 2020లో త్రిభాషా సూత్రం మాకు బాధ కలిగించింది. దశాబ్దాలుగా మా రాష్ట్రం ద్వి భాషా విధానాన్నే అనుసరిస్తోంది. దానిలో ఎలాంటి మార్పు ఉండబోదు.’ అని వ్యాఖ్యానించారు.
Here's what Tamil Nadu CM said:
We are saddened by the 3 language policy introduced by the central government in National Education Policy (NEP) 2020. Our state is already following 2 language policy since decades & there will be no changes in it: Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami (file pic) pic.twitter.com/jZ5RBG2NYJ
— ANI (@ANI) August 3, 2020
నూతన జాతీయ విద్యా విధానంపై తమిళనాడులో రాజకీయ తుఫాను చెలరేగింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్ఈపీని తిరస్కరించాయి. ఇది తమపై బలవంతంగా హిందీ, సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నమంటూ విమర్శించాయి. హెచ్‌ఆర్డీ ఇకపై విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు, ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర కేబినెట్, జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం
సారూప్య రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి దీనికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి కూడా ఎన్‌ఈపీపై అసహనం వ్యక్తంచేశారు. ఇది అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు.