Telangana Rains Live Updates: Orange alert for 5 districts of Telangana

Hyderabad, OCT 02:  తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. బుధవారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Roja on Pawan Kalyan: తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా 

భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ (Hyderabad Rain), మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసేందుకు అవశాలున్నాయని తెలిపింది. గురువారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్‌ ఉందని వివరించింది.