Delhi Violence: Death Toll Rises to 18, NSA Ajit Doval Visits Violence-Hit Areas in Northeast Delhi (photo-PTI)

New Delhi, Sep 1: భారత్‌-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో (India-China border) మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొవల్‌ (National Security Advisor (NSA) Ajit Doval) ఉన్నతాధికారులతో సమవేశమయ్యారు. బార్డర్ పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు (Chinese Army) ప్రయత్నించినట్లు భారత సైన్యం (Indian Army) గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ దళాలు.. డ్రాగన్‌ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్‌ వద్ద బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌, మే నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ భారత్‌కు చెందిన ప్యాంగ్‌యాంగ్ త్సో‌, ఫింగర్‌ ఏరియా, గల్వాన్‌ వ్యాలీ, హాట్‌ స్ప్రింగ్స్‌, కొగ్రుంగ్‌ నాలా ప్రాంతాల్లోకి వచ్చాయి.  చైనా పదే పదే బరి తెగిస్తోంది, తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద సరిహద్దుల్ని మార్చే ప్రయత్నం

ఇదిలా ఉంటే భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ఘర్షణలకు దారి తీయకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాల్సిన ఆవశ్యకత ఉందని డ్రాగన్‌ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ అన్నారు. సినో- ఇండియా బార్డర్‌లో తామెప్పుడూ సుస్థిరతకే ప్రాధాన్యం ఇస్తామని, ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. భారత్‌తో సామరస్యపూర్వక చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.అయితే మా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. రక్షణ కవచంలా నిలబడతామన్నారు.

చైనా- భారత్‌ మధ్య సరిహద్దులు నిర్ణయించబడలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్రిక్తతలు ఘర్షణలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదని కోరారు. కాగా తూర్పు లదాఖ్‌, పాంగాంగ్‌ సో సరస్సు వద్ద చైనా ఆర్మీ బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడిందని భారత్‌ ప్రకటన విడుదల చేసిన కొద్దిసేపటికే వాంగ్‌ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం