85 Lakh Liters of Liquor Seized: అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మద్యం జోరు, 85 లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఈసీ, వీటిలో దాదాపు 70శాతం పంజాబ్‌లోనే సీజ్
Liquor | Image used for representational purpose | (Photo Credit: Wikimedia Commons)

New Delhi, Mar 10: ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో 85లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది. వీటిలో దాదాపు 70శాతం పంజాబ్‌లోనే సీజ్‌ చేసినట్టు ఈసీ తెలిపింది. కాగా ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, భారీగా మద్యంతో (85 Lakh Liters of Liquor Seized) పాటు ఆయా రాష్ట్రాల్లో రూ.575.39 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ పేర్కొంది.

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, విలువైన లోహాల పంపిణీని నిరోధించేలా ఎన్నికల సంఘం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నిఘా బృందాలను ఏర్పాటు చేయగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా జప్తు చేసిన మొత్తం రూ.1061.87 కోట్లు ఉంటుందని తెలిపింది. 2017 ఎన్నికలతో పోలిస్తే (రూ.299.84కోట్లు) ఇది మూడున్నర రెట్లు అధికమని అధికమని వెల్లడించింది. జనవరి 8 నుంచి 85,27,227 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసినట్టు ఈసీ తెలిపింది. వీటిలో అత్యధికంగా పంజాబ్‌లో 59,65,496 లీటర్లు (రూ.36.79 కోట్లు) స్వాధీనం చేసుకోగా.. యూపీలో 22,94,614 లీటర్లు (రూ.62.13 కోట్లు), ఉత్తరాఖండ్‌లో 97,176 లీటర్లు (రూ.4.79 కోట్లు), గోవాలో 95,446 లీటర్లు (రూ.3.57 కోట్లు), మణిపూర్‌లో 74,495 లీటర్లు (రూ.73లక్షలు) చొప్పున స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

ఈవీఎం ట్యాంపరింగ్‌ అనే సమస్యే లేదు, ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే, ఈవీఎం ట్యాంపరింగ్‌ ఆరోపణలపై స్పందించిన సీఈసీ సుశీల్ చంద్ర

ఇకపోతే రూ.575.39 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా.. వీటిలో పంజాబ్‌లోనే 376.19 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ పట్టుకున్నట్టు తెలిపింది. అలాగే, మణిపూర్‌లో రూ.143.78 కోట్లు, యూపీ 48.48 కోట్లు, ఉత్తరాఖండ్‌ 5.66 కోట్లు, గోవా 1.28 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్టు పేర్కొంది. ఈ ఎన్నికల్లో రూ.154.52 కోట్ల నగదు, రూ.117.44 కోట్ల విలువ చేసే విలువైన లోహాలు, 106.52 కోట్ల విలువచేసే ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.