New Delhi, December 4: ఐఎన్‌ఎక్స్ మీడియా (INX Media) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం (P Chidambaram) కు భారీ ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల బెయిల్ బాండ్ తో పాటు, ఇద్దరి జామీనుతో బుధవారం ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తులు ఆర్ భానుమతి, ఎ.ఎస్.బొపన్న, హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ బెయిల్ ఉత్తర్వులను వెలువరించింది.
అయితే సాక్షులను ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు ప్రయాణం చేయకూడదు, మీడియా సంస్థలకు గానీ, బహిరంగంగా గానీ ఎలాంటి ప్రకటనలు చేయకూడదని సుప్రీంకోర్ట్ షరతులు విధించింది. 'పవర్' తిరగబడింది! మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కోసం సీబీఐ వేట
Here's the update:
Supreme Court directs P Chidambaram to furnish a bail bond of Rs 2 lakhs along with 2 sureties of the same amount. SC also says Chidambaram can not travel abroad without the Court's permission. https://t.co/JTs5nGBpJd
— ANI (@ANI) December 4, 2019
INX మీడియా కుంభకోణం కేసుకు సంబంధించి పి. చిదంబరంను, సీబీఐ అధికారులు ఆగష్టు 21న అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లి అరెస్టు చేశారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా అక్టోబర్ 16న ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు అన్ని కోర్ట్ తిరస్కరణలకు గురయ్యాయి. ఎట్టకేలకు 106 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరయ్యింది.
INX మీడియా సంస్థలోకి నిబంధనలకు విరుద్ధంగా రూ .305 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతించారన్న ఆరోపణలపై సీబీఐ మరియు ఈడీలు వేరువేరుగా కేసులు నమోదు చేశాయి. దీంతో ఆగష్టు 21న ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా, అక్టోబర్ 21న సీబీఐ కేసులో ఆయనకు బెయిలు లభించినా కూడా, ఈడీ అదుపులో ఉండటం చేత చిదంబరం బయటకు రాలేకపోయారు. తాజాగా, ఈడీ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ లభించటంతో ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు రావటానికి మార్గం సుగమం అయింది.