పార్లమెంట్ (Parliament)పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి లోక్‌సభ (Lok sabha)లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ (public gallery) నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు.ఈ ఘటన జరిగిన వెంటనే లోక్‌సభ కార్యకలాపాలు నిలిచిపోయి, సభ వాయిదా పడింది. నివేదికల ప్రకారం, గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన సందర్శకుడు బెంచీల మీదుగా దూకడం కనిపించింది. ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుండి కిందకు దూకి, గ్యాస్‌ను విడుదల చేసే వస్తువులను విసిరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Here's Video
Shocking security breach in Lok Sabha!
Today on Parliament attack anniversary, two intruders jump from the visitors' gallery into the Lok sabha house while parliamentary proceedings were on. MPs evacuate as intruders, one in blue jacket, roam inside spraying an… pic.twitter.com/LgrJaxSlrw
— Nabila Jamal (@nabilajamal_) December 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)