Parliament Session 2021: రఘురామ సీబీఐ కేసులు తెరపైకి, వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, లోక్ సభలో వైసీపీ ఎంపీల మధ్య ముదిరిన వార్
YSRCP Rebal MP K Raghu Ramakrishna Raju (Photo-ANI)

New Delhi, Dec 6: నేటి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైసీపీ ఎంపీల మధ్య వార్ నడిచింది. లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (YSRCP MP Mithun Reddy) తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై (MP Raghu Rama Krishna Raju) రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్‌ థర్మల్‌ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన బ్యాంకులను మోసం చేశాడు.

వాటి నుంచి బయట పడటం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మా పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టే.. ఆ కేసుల నుంచి బయటపడటానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసులను (CBI) వీలైనంత త్వరగా తేల్చండి. భారత్‌ థర్మల్‌ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని’’ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇక జీరో అవర్ లో రైతుల మహాపాదయాత్రకు పోలీసుల అడ్డంకులు కల్పించడాన్ని తప్పు పట్టిన రఘురామ ఆ అంశాన్ని ప్రస్తావించారు. రఘురామ వ్యాఖ్యలను ఖండించిన వైసీపి లోక్ సభా పక్ష నేత మిధున్ రెడ్డి ఆయన వ్యాఖ్యలపైన అభ్యంతరం వ్యక్తం చేసారు. గాంధేయ పద్దతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకోవడం అన్యాయమని రఘురామ వ్యాఖ్యానించారు.హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు.

రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసారు. భూములు ఇచ్చిన రైతులు గాంధేయ మార్గంలో జరుపుతున్న మహాపాదయాత్రకు పోలీసులు తీవ్రమైన అడ్డంకులు సృష్టించడమే కాకుండా రైతులను తీవ్రంగా హింసిస్తున్నారని ఎంపీ రఘురామ వివరించారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారంటూ ఎంపీ రఘురామ ఆరోపించారు.

ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపిన హోంమంత్రి అమిత్ షా

ఈ సమయంలో రఘురామ ప్రసంగాన్ని అడ్డుకునేందు కు వైసీపీ ఎంపీలు ప్రయత్నించారు. సిబిఐ కేసులనుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బిజెపిలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఎంపీ మిధున్ రెడ్డి కామెంట్ చేసారు. ఎంపీ రఘురామపై ఉన్న సిబిఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని మిధున్ రెడ్డి డిమాండ్ చేసారు. అయితే.. తన పైన రెండు సీబీఐ కేసులే ఉన్నాయని... సీఎం జగన్‌ పైన వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఎంపీ రఘురామ కౌంటర్ ఇచ్చారు.

లోక్ సభలో ఏపీ ఆర్దిక పరిస్థితి పైన రఘురామ రాజు ప్రస్తావించారు. దీనికి వైసీపీ విప్..రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రియాక్ట్ అయ్యారు. రఘురామ రాజు పైన సీబీఐ కేసుల పైన చర్యలు తీసుకోవాలని ఛైర్ ను కోరగా..దాని పైన సంబంధిత మంత్రిని కోరాలని సూచించారు. రెండు వైపుల నుంచి వాగ్వాదం పెరుగుతుండటంతో స్పీకర్ ఛైర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్ట్ చేయటం...సుప్రీం బెయిల్ ఇవ్వటంతో ఆయన అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇక, రఘురామ పైన అనర్హత వేటు కోసం వైసీపీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.