Central Govt Praises RBI: ఆర్‌బీఐ చర్యలను ప్రశంసించిన కేంద్రం, రుణాల జారీ మెరుగుపడుతుందన్న ప్రధాని, దేశ ఆర్థిక రంగం కుదుటపడే అవకాశం ఉందన్న హోం మంత్రి
PM Modi with Home Minister Amit Shah | File Image | (Photo Credits: PTI)

New Delhi, April 17: ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్‌ షాలు ప్రశంసించారు. కేంద్ర బ్యాంక్‌ చర్యలతో వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరగడంతో పాటు రుణాల జారీ మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేశాం : ఆర్‌బీఐ

ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలతో చిన్న వ్యాపారాలు, మధ్యతరహా పరిశ్రమలు, రైతులు, పేదలకు ఊరట లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలకూ అత్యవసర నిధుల కింద సమకూరే నిధుల లభ్యత పెరుగుతుందని ప్రధాని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ మీడియా సమావేశం అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) కారణంగా ఇబ్బందులను ఎదర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను ఎ‍ప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Home minister amit shah) ప్రశంసలు కురిపించారు. ఆర్‌బీఐ సహాయం ద్వార దేశ ఆర్థిక రంగం కుదుటపడే అవకాశం ఉందని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. కాగా నాబార్డ్‌కు రూ.25 వేల కోట్లు, ఎస్‌ఐడీబీఐకి 15 వేల కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 50 వేల కోట్లు కేటాయిస్తూ (Economic Package) ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అమిత్‌ షా సంతోషం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్ పొడగింపుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై పిడుగు పాటు

ఆర్‌బీఐ (Reserve Bank of India) సహాయం ద్వారం దేశంలో​ రైతులకు, గ్రామీణా ప్రాంత ప్రజలకు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ( Shaktikanta Das) ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా పలు చర్యలు చేపడుతున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు.

 దేశంలో 13 వేలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 437 కు పెరిగిన మరణాల సంఖ్య

వ్యవస్ధలో ద్రవ్య లభ్యత పెంచడం, రుణ పరపతి మెరుగుదల సహా పలు చర్యలను ఆయన ప్రకటించారు. కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.