PM Narendra Modi gifts Rs 614 crore projects to Varanasi ahead of Diwali (Photo-ANI)

Varanasi, Nov 9: ప్రధాని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన వార‌ణాసికి దీపావ‌ళి కానుక (PM Modi Gifts to Varanasi) ఇచ్చారు. వారణాసిలో రూ. 614 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ సోమ‌వారం శంకుస్థాప‌న (Modi gifts Rs 614 crore projects to Varanasi) చేశారు. వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క రంగాల‌తో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించిన‌ అభివృద్ది ప‌నుల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శంకుస్థాప‌న చేసిన మోదీ.. యూపీ సీఎం యోగితో (Yogi Adityanath) పాటు పలువురు ల‌బ్దిదారుల‌తో మాట్లాడారు.

రామ్‌న‌గ‌ర్‌లోని లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి హాస్పిట‌ల్ అప్‌గ్రేడ్ ప‌నుల‌కు, మురికి కాల్వ‌ల ప‌నుల‌కు, గోశాలల ర‌క్ష‌ణ‌, వాటికి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు, సంపూర్ణ‌నంద్ స్టేడియంలో ఆట‌గాళ్ల కోసం హౌజింగ్ కాంప్లెక్స్‌, విత్త‌నాల గోడౌన్‌కు, సార‌నాథ్ లైట్‌, సౌండ్ షోకు, ద‌శ‌శ్వామేథ ఘాట్‌, ఖైడ్‌ఖియా ఘాట్ రీ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌నుల‌కు, పీఏపీ పోలీస్ ఫోర్స్ బ్యార‌క్స్‌కు, వార‌ణాసిలోని రోడ్ల మ‌రమ్మ‌తుల‌కు, టూరిజం ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న చేశారు.

ఈ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుల లబ్ధిదారులలో కొంతమందితో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని సంభాషించారు. లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ రామ్‌నగర్ యొక్క అప్‌గ్రేడేషన్, మురుగునీటి సంబంధిత పనులు, ఆవుల రక్షణ మరియు సంరక్షణ కోసం మౌలిక సదుపాయాలు, సంపర్నానంద్ స్టేడియంలోని ఆటగాళ్లకు హౌసింగ్ కాంప్లెక్స్, బహుళార్ధసాధక సీడ్ స్టోర్‌హౌస్ మరియు సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో వంటి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.

నౌకాయానం పేరు జలరవాణా శాఖగా మార్పు, గుజరాత్‌లో రో–పాక్స్‌ ఫెర్రీ సర్వీసును ప్రారంభించిన ప్రధాని మోదీ, గుజరాత్ రాత మారబోతుందని తెలిపిన ప్రధాని

దీపావళి వేడుకల సందర్భంగా భారత ప్రజలంతా ‘‘దేశీయ నినాదానికి’’ (వోకల్ ఫర్ లోకల్) మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘లోకల్ ఫర్ దివాళీ’’ని ప్రమోట్ చేయాలనీ.. పండుగల సీజన్ మొత్తం స్థానికంగా తయారైన వస్తువులను కొనేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దేశీల వస్తువులతో దీపావళి జరుపుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో నూతన జవసత్వాలు నింపవచ్చునని ప్రధాని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Here's PM Modi Tweet

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో పలు పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ..‘‘ఇవాళ మీరు సర్వత్రా వోకల్ ఫర్ లోకల్ నినాదంతో పాటు లోకల్ ఫర్ దివాళీ మంత్రాన్ని వింటున్నారు. వారణాసితో పాటు దేశంలోని ప్రజలంతా ఈ పండుగ సీజన్‌లో లోకల్ ఫర్ దివాళీ నినాదాన్ని ప్రమోట్ చేయాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సగర్వంగా దేశీయ వస్తువులనే కొనుగోలు చేయడం ద్వారా... స్థానిక వస్తువుల గురించి మాట్లాడుతూ, వాటిని ప్రోత్సహించడం ద్వారా.. మన దేశీయ వస్తువులు మంచివి అన్న సందేశాన్ని ఇతరుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ప్రధాని పేర్కొన్నారు. తద్వారా స్థానిక నినాదం శరవేగంగా విస్తరిస్తుందన్నారు.

నవంబర్ 30 వరకు టపాసులు కాల్చడం బ్యాన్, కీలక నిర్ణయం తీసుకున్న ఎన్జీటీ, వాయు కాలుష్యం ఉన్న పట్టణాల్లో గ్రీన్ కాకర్స్ మాత్రమే వెలిగించాలని ఆదేశాలు

దీనివల్ల స్థానిక వస్తువులు గుర్తింపునకు నోచుకోవడం మాత్రమే కాదు.. వాటిని తయారు చేసేవారి జీవితాల్లో కూడా దీపావళి వెలుగులు నింపగలం...’’ అని మోదీ పేర్కొన్నారు. స్థానిక వస్తులను కొనుగోలు చేయడమంటే కేవలం ‘‘మట్టి ప్రమిదలు’’ కొనడం మాత్రమే కాదనీ... దీపావళికి ఉపయోగించే వస్తులన్నీ స్థానిక తయారీ దారుల నుంచే కొనుగోలు చేయాలని కోరారు. అలా చేసినప్పుడే వారిని నిజమైన ప్రోత్సాహాన్ని అందించగలమని ప్రధాని స్పష్టం చేశారు.