Rashtrapati Bhavan (Credits: Wikimedia Commons)

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుండటంతో కొత్త ప్రెసిడెంట్ కోసం ఎన్నికలకు (Presidential Election 2022) సిద్ధమైంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు జూన్ 15న పిలుపునివ్వనుండగా.. నామినేషన్స్ వేసేందుకు ఆఖరి తేదీ జూన్ 29 నిర్ణయించారు. ఎన్నికలు జూలై 18న నిర్ణయించగా.. కౌంటింగ్ ప్రక్రియను జూలై 21వ తేదీన జరుగుతుందని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

ఎన్నికల ప్రక్రియ (President And Vice President Polls) పూర్తి కొవిడ్ ప్రొటోకాల్స్ తో జరుగుతుందని ఈ సందర్భంగా మాట్లాడిన సీఈఈ రాజీవ్ కుమార్.. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏ రాజకీయ పార్టీ విప్‌ను అనుమతించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఎన్నిక ప్రక్రియను జులై 24వ తేదీ లోపు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలి.

రాజ్యసభ ఎన్నికలు, ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవం, మొత్తం 16 స్థానాలకు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అనివార్యం

మరుసటి రోజైన జూలై 25 న కొత్త రాష్ట్రపతి బాద్యతలు స్వీకరించాలి. ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో 4వేల 896 సభ్యులుండగా అందులో 4వేల 120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉండనున్నారు. మొత్తం ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్లు 10 లక్షల 86 వేల 435 ఉండగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలి.