Hyderabad, Oct 14: హైదరాబాద్ (Hyderabad) లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (జీఎన్ సాయిబాబా) (Professor Saibaba) ఇటీవలే కన్నుమూయడం తెలిసిందే. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబులెన్సులోనే సాయిబాబా పార్థివదేహం ఉండిపోయింది. ఫలితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Here's Video:
ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు
గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం
అంబులెన్సులోనే ఉండిపోయిన పార్థివదేహం#Profsaibaba #Professorsaibaba #Bigtv https://t.co/6kLqjiCI3F pic.twitter.com/eFgtxZRS9R
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2024
పరిశోధనల కోసం గాంధీకి..
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా నిమ్స్ దవాఖానలో చికిత్సం పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రొఫెసర్ సాయిబాబా కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. ఇప్పటికే ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కి దానమిచ్చారు.