Chandigarh, Febuary 3: ఇప్పుడు వైన్ అనేది చాలా డిమాండ్ అయిపోయింది, కొన్ని రాష్ట్రాలు మద్యంపై (Liquor) షరతులతో కూడిన అమ్మకాలు ఇవ్వడంతో మందుబాబులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలు అయితే మద్యం అమ్మకాలు ప్రభుత్వ షాపుల్లోనే కొనాలంటూ లైసెన్స్ మంజూరు విషయంలో కఠిన నిబంధనలు జారీ చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో మందు బాబులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంజాబ్ రాష్ట్రం (Liquor) కీలక నిర్ణయం తీసుకుంది.
బీరు తాగితే బొజ్జలు కరిగిపోతాయి
కిరాణాకొట్టుల ద్వారా మద్యం అమ్మకాలను జరిపేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటివరకు కిరాణ కొట్టులో ఉప్పు, పప్పు, సబ్బులు, టూత్ పేస్ట్ వంటివి కొన్నారు. ఇకపై అక్కడ మందు బాటిళ్లు కూడా కొనొచ్చు. ఇందులో భాగంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ( New liquor policy) తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఫారిన్ వైన్ (foreign liquor) లేదా ఇంపోర్టడ్ లిక్కర్(imported liquor) కిరాణ(kirana stores) షాపుల్లోనూ అమ్ముతారు.
గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న
మద్యం తయారీ కంపెనీలు.. స్థానికంగా ఉన్న కిరాణ షాపుల యజమానులతో ఇందుకోసం ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత షాపుల్లోనూ లిక్కర్ బాటిల్స్(liquor bottles) అమ్ముతారు. ఇందుకోసం ప్రభుత్వం వారికి L2B లైసెన్స్ ఇవ్వనుంది. గతంలో డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో(departmental stores) మాత్రమే ఫారిన్ లిక్కర్ అమ్మకాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇకపై కిరణా షాపుల్లోనూ అమ్మకాలు జరుపుతారు.
ఆ బీరు తాగేందుకు జంకుతున్న మద్యం ప్రియులు
ఈ కొత్త లిక్కర్ పాలసీ 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం పలు షరతులను విధించింది. షాపుకి 400 స్వ్కేర్ ఫీట్ లో ఉండాలి. గ్రోసరీ, షుగర్, బేకరీ, టాయ్ లెటరీస్ , కాస్మోటిక్స్, హౌస్ హోల్డ్ గూడ్స్, టాయ్స్, స్పోర్ట్స్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, ఆఫీస్ స్టేషనరీ, గిఫ్ట్ ఐటెమ్స్ లేదా హౌస్ హోల్డ్ గూడ్స్ లాంటి వాటిని విక్రయించే షాపు అయి ఉండాలి. ఈ పాలసీ కోసం లైసెన్స్ ఫీజుని రూ.20లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ లైసెన్స్ ఫీజు రూ.10లక్షలుగా ఉండేది.
అయితే పంజాబ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళలు ఈ పాలసీపై మండిపడుతున్నారు. మద్యపానం కారణంగా ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.