Hyderabad, Dec 3: భారత స్టార్ షట్టర్ పీవీ సింధు వివాహానికి (PV Sindhu Marriage) మూహూర్తం ఖరారైంది. వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు త్వరలోనే పెండ్లి (Marriage) పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్ వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో సింధు పెళ్లి ఖాయమైందని ఆమె తండ్రి పీవీ రమణ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో ఈ నెల 22న పెళ్లి జరగనుందని ఆయన తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పెళ్లి పీటలు ఎక్కబోతున్న PV సింధు
ప్రముఖ వ్యాపారి వెంకట సాయి దత్తతో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు పెళ్లి నిశ్చయం
ఈనెల 22న ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వివాహం
24న హైదరాబాద్ HICC లో రిసెప్షన్ @Pvsindhu1 #PVSindhu #VenkatasaiDatta #Bigtv pic.twitter.com/Hv6NGqyhVA
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2024
గతనెలలోనే నిర్ణయం
సాయి కుటుంబం తమకు చాలా కాలంగా తెలుసునని, గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకున్నామని రమణ చెప్పారు. వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.