Rajiv Tyagi (Photo Credits: ANI)

New Delhi, August 12: కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ త్యాగి ఘజియాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో (Rajiv Tyagi Dies) కన్నుమూశారు. రాజీవ్ త్యాగి మ‌ర‌ణించాడ‌ని కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి (Congress Spokesperson) అయిన రాజీవ్ త్యాగి ఆకస్మిక మరణంపై పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్, ప్రియాంకలకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన త్యాగి మరణంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి

రాజీవ్ త్యాగి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. నిజమైన దేశభక్తుడు, బలమైన నేతను కోల్పోయామని తెలిపింది. త్యాగి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించింది. కాగా, గత అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్‌లో మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కీల‌కంగా ప‌నిచేశారు.

Congress tweet

త్యాగి మరణం నిజంగా మాకు వ్యక్తిగత నష్టమని ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ త్యాగి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగత నష్టం. అతన్ని భర్తీ చేయలేము. రాజీవ్ జీ భావజాలానికి అంకితమైన యోధుడు ”అని ప్రియాంక తన ట్వీట్‌లో పేర్కొంది. గుండెపోటుతో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్‌ మిత్ర మృతి, ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌

త్యాగి మరణానికి కొన్ని నిమిషాల ముందు తనతో టెలివిజన్ చర్చలో పాల్గొన్నారని బిజెపి నాయకుడు సంబిత్ పత్రా షాక్ వ్యక్తం చేశారు. నా స్నేహితుడు మరియు కాంగ్రెస్ ప్రతినిధి ఇకపై మాతో లేరని నమ్మలేకపోతున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు షోలో మేము ఆజ్ తక్ లో కలిసి చర్చించాము. జీవితం చాలా అనూహ్యమైనది. నేను ఇంకా పదాలను కనుగొనలేకపోయాను, ”అని పత్రా అన్నారు. ఎంపీ వీరేంద్ర కుమార్ కన్నుమూత, కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసిన మాతృభూమి మేనేజింగ్‌ డైర్టెక్టర్‌, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

ఎన్‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్ కూడా రాజీవ్ త్యాగి మరణానికి సంతాపం తెలిపారు. త్యాగి మరణం గురించి వినడానికి బాధగా ఉంది. శోకం సమయంలో కుటుంబానికి మరియు సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు. రాజీవ్ త్యాగి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలాసాహెబ్ తోరత్ తెలిపారు. "కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ త్యాగి ఆకస్మిక మరణం చాలా షాకింగ్ మరియు విచారకరం. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి హృదయపూర్వక సంతాపం తెలియజేస్తేన్నానంటూ ట్వీట్ చేశాడు.