Ram Swaroop Sharma Dies (Photo Credits: Facebook)

New Delhi, March 17: దేశ రాజధానిలో బీజేపీ ఎంపీ అనుమానాస్పద మరణం కలకలం రేపింది. హిమాచల్‌ ప్రదేశ్‌ మండికి చెందిన ఎంపీ రామ్ స్వరూప్ శర్మ బుధవారం తన ఇంటిలో శవమై (BJP MP Ram Swaroop Sharma Dies) కనిపించారు. అయితే ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. భార్య చార్‌ధామ్‌ యాత్రలో ఉన్నందున ఢిల్లీలోని నివాసంలో ఆయన (Ram Swaroop Sharma) ఒంటరిగా ఉన్నారు. ఇంతలోనే ఆయన అకాలమరణం కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.

ఉదయం ఆయన వ్యక్తిగత సహాయకుడు ఫోన్ చేయగా... శర్మ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. నివాసానికి వెళ్లిన పోలీసులు, గది తలుపులు బద్దలుకొట్టగా... ఫ్యాన్‌కు వేలాడుతూ దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు ఇప్పటివరకు లభించలేదన్నారు. విచారణ జరుగుతోందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కాగా 1958 లో హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో జన్మించిన శర్మ 2014 లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో తిరిగి ఎన్నికయ్యారు. ఆయన 2014 లో తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. అటు శర్మ ఆకస్మిక మృతిపై పలువురు కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్లు, బీజేపీ శ్రేణులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించాయి. దీంతో ఈ రోజు జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు.

వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మంత్రికి, వైద్యునికి కరోనా, కోవిడ్ కల్లోలంతో నైట్ కర్ఫ్యూ విధించిన గుజరాత్, మార్చి 17 నుండి మార్చి 31 వరకు కర్ఫ్యూ అమల్లోకి

ఎంపీ స్వ‌రూప్ శ‌ర్మ గ‌త కొన్నాళ్ల నుంచి తీవ్ర మాన‌సిక‌క్షోభ‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆరు నెల‌ల నుంచి డిప్రెష‌న్ చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం ఆయ‌న ఒంటరిగా ఉంటున్నారు. ఆయ‌న భార్య .. చార్‌థామ్ యాత్ర‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. శ‌ర్మ‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ సెక్యూర్టీ ఆఫీస‌ర్ ప్ర‌స్తుతం మండీలో ఉన్నారు. ఎంపీ స్వ‌రూప్ ఆత్మ‌హ‌త్య‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మరోవైపు బీజేపీ కేంద్ర మాజీమంత్రి దిలీప్‌ గాంధీ (Dilip Gandhi Dies) ఈ రోజు కరోనాతో కన్నుమూశారు. మంగళవారం కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ ఆయన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస తీసుకున్నారు. దిలీప్‌గాంధీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు.

ఇండియాలో సెకండ్ వేవ్, దేశంలో తాజాగా 24,492 మందికి కరోనా నిర్ధారణ, సెకండ్ వేవ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17న సీఎంలతో వర్చువల్ సమావేశం కానున్న ప్రధాని మోదీ

అహ్మద్‌నగర్ దక్షిణ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన దిలీప్ గాంధీ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొదటిసారి 1999లో ఆ తరువాత 2009, 2014లో మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా కేంద్ర ఆరోగ్యం శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 28,903 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 188 మరణాలు సంభవించాయి.