Deepthi Sri Murder Mystery: విషాదంగా ముగిసిన దీప్తి శ్రీ కథ, ఇంద్రపాలెం వంతెన వద్ద మూటలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం, సవతి తల్లే సూత్రధారి, పోలీసుల విచారణలో వెల్లడి
Seven-year old Kakinada Girl Deepthi Sri Kidnap Mystery(Photo-Social Media)

Kakinada, November 25: కాకినాడలోని జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌(Jagannathpuram water tank) వద్ద ఉన్న నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల(Netaji Municipal Primary School)లో రెండో తరగతి చదువుతోన్న చిన్నారిని ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్‌(Kakinada Girl Kidnap Mystery) గురై నగరంలో కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిన్నారి కథ విషాదంగా ముగిసింది. సవతి తల్లి దాష్టీకానికి దీప్తి శ్రీ బలైపోయింది.

చిన్నారి మిస్సింగ్ కేసు తర్వాత 48 గంటలకు మిస్టరీ వీడింది. ఇంద్రపాలెం వంతెన వద్ద చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. చిన్నారి దీప్తి శ్రీని తానే హతమార్చి ఉప్పుటేరులో పడేశానని దీప్తిశ్రీ సవతి తల్లి శాంతి కుమారి(Shanti Kumari) చెప్పటంతో పోలీసులు ఇంద్రపాలెం వంతెన వద్ద గాలింపు చేపట్టి ఎట్టకేలకు దీప్తి శ్రీ మృతదేహాన్ని బయటకు తీశారు.

సీసీ కెమెరాల్లో చిన్నారిని సవతి తల్లే తీసుకువెళ్లినట్టు రికార్డు అయిందని తెలుస్తోంది. అయితే ముఖానికి ముసుగు వేసుకోవడం వల్ల పోలీసులు వెంటనే నిర్ధారించ లేకపోయారు. పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్‌ చేయడం, పాఠశాల విద్యార్థులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో.. పాఠశాల నుంచి దీప్తిశ్రీని తీసుకువెళ్లి తానే హత్య చేశానని సవతి తల్లి ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పాఠశాల నుంచి నేరుగా సంజయ్‌నగర్‌లోని ఆమె ఇంటికి తీసుకెళ్లి పాప వెనక్కి తిరిగి ఉన్న సమయంలో మెడలో తువ్వాలు వేసి బిగించి చంపేసినట్లు అంగీకరించినట్టు చెబుతున్నారు. పాపను చంపేసిన తరువాత గోనె సంచిలో కట్టేసి సంజయ్‌నగర్‌ నుంచి బైక్‌పై ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చి ఉప్పుటేరులో పడవేసినట్లు పోలీసుల విచారణలో సవతి తల్లి వివరించినట్లు తెలుస్తోంది.

ఇంద్రపాలెం వంతెనవద్ద ఉప్పుటేరులో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీయించిన పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్‌నకు కుటుంబ కలహాలే కారణమని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్‌ తెలిపారు.

దీప్తి శ్రీ మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు పంపిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు దీప్తి శ్రీ మర్డర్ మిస్టరీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు శాంతి కుమారి ఈ ఘాతుకానికి పాల్పడటానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.