Bhopal, Feb 16: మధ్యప్రదేశ్‌లో ఓ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య (Sidhi Bus Accident) మరింత పెరిగింది. మొత్తం 54 మందితో ప్రయాణిస్తున్న బస్సు సిధి జిల్లాలోని పట్నా గ్రామం వద్ద కాలువలో పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటనలో 45 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో అనేక మృతదేహాలను (45 dead after bus falls into canal near Satna) వెలికితీశారు.
బస్సు పూర్తిగా నీట మునగడంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయి. కాగా, ఈ ప్రమాదం నుంచి ఏడుగురిని కాపాడామని అధికారులు తెలిపారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్), స్థానిక అధికారులు అక్కడికక్కడే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్టు తెలిపారు. ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తారని పీఎంఓ ఒక ట్వీట్‌లో తెలిపింది. అటు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Here's PM Tweet
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to the bus accident in Sidhi, Madhya Pradesh. Rs. 50,000 would be given to those seriously injured.
— PMO India (@PMOIndia) February 16, 2021
కాగా, ఈ ప్రమాదం నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ, బస్సు దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు.
మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని సత్నా గ్రామానికి సమీపంలో బస్సు వంతెనపై నుంచి కాలువలో పడింది. 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు సిద్ద నుండి సత్నాకు వెళుతుండగా, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో శారధపతక్ గ్రామంలోని (Shardhapathak village) ఓ కాలువలో పడింది. బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని, ఉదయం వేళల్లో కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
తరువాత, నీటి మట్టాన్ని తగ్గించిన బంగంగ ప్రాజెక్టు నుండి కాలువలోకి నీటిని విడుదల చేయడాన్ని జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. బస్సు నీటిలో పడిపోయిన ప్రదేశానికి కొంత దూరంలో ఉన్నట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ప్రమాదం దృష్ట్యా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాస్తవంగా హాజరు కావాల్సిన హౌస్ వార్మింగ్ వేడుకను సిఎం రద్దు చేశారు.