SCR Special Trains: సంక్రాంతికి ట్రైన్ టికెట్లు దొర‌క‌లేదా? మీకోస‌మే ప్ర‌త్యేక రైళ్లు న‌డిపిస్తున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, స్పెష‌ల్ ట్రైన్స్ షెడ్యూల్ ఇదే!
Credits: ANI

Hyderabad, JAN 13: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పండుగక ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతుండగా.. రద్దీ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మరిన్ని రైళ్లను పట్టాలెక్కించింది. సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ -తిరుపతికి (07489) ప్రత్యేక రైలు 15న సోమవారం రాత్రి 20.10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 16న తిరుపతి – సికింద్రాబాద్‌ (07490) ప్రత్యేక రైలు 4.35 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది. 17న సికింద్రాబాద్‌ -కాకినాడ టౌన్‌ (07066) ప్రత్యేక రైలు అందుబాటులో అందుబాటులో ఉండనున్నది. రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 7 గంటలకు బయలుదేరి, గురువారం ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్‌లో ఉంటుంది. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ (07067) రైలు రాత్రి 9గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది.

Governor Tamilisai: రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుకలు.. పాయ‌సం వండిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌందర్ రాజన్.. వీడియో 

17న నర్సాపూర్‌ – సికింద్రాబాద్‌ (07251) రైలు సాయంత్రం 6గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువ జామున 4.50 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. 18న సికింద్రాబాద్-నర్సాపూర్‌ (07252) ప్రత్యేక రైలు రాత్రి 11.30 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 8.35 నర్సాపూర్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌– తిరుపతి–సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు కాచిగూడ, ఉమ్దానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహమూబ్‌నగర్‌, వనరపర్తి, గద్వాల్‌, కర్నూల్‌, ఢోన్‌, గూటీ, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్‌, రేణిగుంట స్టేషన్స్‌లో ఆగుతుంది. సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, కైకలూరు, భీమవారం టౌన్‌, తనకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లో ఆగనున్నది.

Mumbai Trans Harbour Link Inauguration: దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో.. 

నర్సాపూర్–సికింద్రాబాద్‌ రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్స్‌లో ఆగుతాయి. సికింద్రాబాద్‌ – నర్సాపూర్‌ రైలు జనగామ, కాజీపేట, వరంగల్‌, మహమూబాబాద్‌, ఖమ్మం, మధిర, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, భీమవరం జంక్షన్‌, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.