
Washington, May 31: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నూతన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ( Srungavarapu Niranjan) ఎన్నికయ్యారు. తానా ఎన్నికల్లో (Tana President Election) నిరంజన్ ప్యానెల్ గెలుపొందింది.2023-25 కాలానికి గాను ఆయన తానా తదుపరి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నిరంజన్.. గతంలో పలు పదవులు నిర్వహించారు.
కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలోని రాజానగరానికి చెందిన నిరంజన్ 2001లో అమెరికా వెళ్లారు. 2003లో అక్కడ ఐటీ కంపెనీ ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్‌లో నివసిస్తున్నారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై ఆయన విజయం సాధించారు. నిరంజన్ ప్యానెల్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలి (Naren Kodali) ప్యానెల్‌కు 9,108 ఓట్లు దక్కాయి. తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు జై తాళ్లూరి తెలపారు. టీం నిరంజన్ ప్యానల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు జై తాళ్లూరి ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని విడుదల చేశారు.
Here's Update
Congratulations to Niranjan Srungavarapu Garu for winning the TANA (Telugu Association of North America) 2021 elections.
My best wishes 💐 pic.twitter.com/n0zrHcLQk9
— S.Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 30, 2021
తానాలో గెలుపోటములు ఉండవని.. బరిలో దిగిన ప్రతి వాళ్లూ గెలిచినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పాల్గొన్నందుకు నరేన్ కొడాలి టీంకు ఆయన అభినందనలు చెప్పారు. తానా అభ్యున్నతకి అందరూ కలిసి పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. నరేన్ కొడాలికి తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, సతీశ్ వేమన వంటి వారి మద్దతు ఉన్నప్పటికీ ఆయన ప్యానల్ ఓటమి పాలైంది.