రెండు తెలుగు రాష్ట్రాల రహదారులు ఈ రోజు వేకువజామున నెత్తురోడాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్నప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలుపలికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు బోల్తా...ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం
బోల్తా పడ్డ బస్సును క్రేన్ సాయంతో సరిచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి కారణం గుర్తించేందుకు దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తున్న సమయంలో అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్ని హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి(13), గోవర్థిని(8)గా పోలీసులు నిర్ధారించారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టిన బస్సు, డ్రైవర్ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
ఇక తెలంగాణలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై ముస్కాన్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 25 మందికి గాయాలు కాగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పది మందిని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోందని.. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.