Tirupati Laddu Free: ఇకపై తిరుపతి లడ్డు అందరికీ ఉచితం, జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న టీటీడీ, రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం
Tirumala Tirupati Devasthanam free-laddu-tirumala-new-year-onwards (Photo-YouTube grab)

Tirumala, December 31: తిరుపతి లడ్డులంటే(Tirupati Laddu) చాలామందికి ఎంతో ఇష్టం. తిరుపతికి వెళ్లలేని వారు ఎలాగోలా వాటిని తెప్పించుకుని ఆ ఏడుకొండల వాడు కరుణ కటాక్షం పొందుతుంటారు. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)(Tirumala Tirupati Devasthanam) నూతన సంవత్సరానికిగానూ తీపి కబురు అందించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు (TTD Laddu Free) అందించనున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది.

అయితే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇంతకుముందు కేవలం కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా ఇక నుంచి అందరికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 20 వేల లడ్డూలను అందిస్తోంది.

ఈ కొత్త విధానం ద్వారా ఉచిత లడ్డుతో కలిపి రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనుంది. ఇక అదనంగా లడ్డులు కోరే భక్తులకు ప్రస్తుతం ఉన్న ధరకే లడ్డూలు ఇస్తామని టీటీడీ వెల్లడించింది.

ఇదిలా ఉంటే టీటీడీ పాలక మండలి (TTD trust board) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని(Lord Venkateswara Temple) జమ్ముకశ్మీర్‌లో(Jammu) నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో (Varanasi)పాటు ముంబైలోనూ(Mumbai) ఆలయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు చేసింది.

స్థలం కేటాయింపుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించామని తెలిపారు.