Narada Bribery Case: అసలేంటి నారదా కుంభకోణం కేసు, నన్ను కూడా అరెస్ట్ చేయమంటూ మండిపడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేసిన సీబీఐ
CBI (Photo-PTI)

Kolkata, May 17: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయం వేడెక్కింది. నారద అవినీతిలో (Narada Bribery Case) టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేసింది. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ క్యాబినెట్‌లోని ఫిర్‌హ‌ద్ హ‌కీమ్‌, సుబ్ర‌తా ముఖ‌ర్జీల‌ను (Bengal ministers Firhad Hakim, Subrata Mukherjee) సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నార‌ద బ్రైబ‌రీ కేసులో వారిని అరెస్టు చేశారు. ఇవాళ ఉద‌యం 9 గంట‌ల‌కు మంత్రి ఇంటికి వెళ్లి ఫ‌ర్‌హ‌ద్ హ‌కీమ్‌ను కేంద్ర బ‌ల‌గాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. తృణ‌మూల్ ఎమ్మెల్యే మ‌ద‌న్ మిత్రా, మ‌రో నేత సోవ‌న్ ఛ‌ట‌ర్జీ ఇండ్ల‌కు కూడా కేంద్ర బ‌ల‌గాలు వెళ్లాయి.

ఇక అధికార పార్టీకి చెందిన మంత్రిని సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ( West Bengal Chief Minister Mamata Banerjee) పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన (TMC workers protest) వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హ‌కీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌లే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడోసారి సీఎం అయిన మ‌మ‌తా బెన‌ర్జీ క్యాబినెట్‌లో ఫిర్‌హ‌ద్‌, సుబ్ర‌తా ముఖ‌ర్జీలు మంత్రులుగా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం, బెంగాలీలో ప్ర‌మాణస్వీకారం చేసిన దీదీ, కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం

2014లో ఓ వ్య‌క్తి తాను బ‌డా వ్యాపారవేత్తనంటూ... ప‌శ్చిమ బెంగాల్‌లో పెట్టుబ‌డులు పెడ‌తానంటూ, ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యేను క‌లిశారు. ఈ నేప‌ధ్యంలో వారికి కొంత డ‌బ్బు ఇచ్చినట్టు ఆడియో టేపులు బయటకు వచ్చి, సంచ‌ల‌నం సృష్టించాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ టేపుల వ్యవహారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నార‌ద న్యూస్ చేప‌ట్టిన ఆ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో (Narada sting operation case) వీరంతా కెమెరా ముందే ముడుపులు తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డారు.అయితే నాటి ఎన్నిక‌ల్లో టీఎంసీ విజ‌యం సాధించ‌డంతో ఈ కుంభ‌కోణం మ‌రుగున ప‌డింది. తాజాగా ఈ టేపుల వ్య‌వ‌హారం మళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఈ ఉదంతంలో అప్పటి తృణమూల్ కాంగ్రెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు.

బెంగాల్‌లో భారీ హింసాకాండ, ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని

ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్ ఈ కేసు విచారణను సీబీఐకి అప్ప‌గించారు. న‌లుగురు తృణ‌మూల్ (Trinamool Congress) నేత‌ల‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు సీబీఐకి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధంఖ‌ర్ అనుమ‌తి ఇవ్వడంతో ఈ ఉదంతం ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా నగరంలోని సీబీఐ ఆఫీసు దగ్గర టీఎంసీ కార్యకర్తల నిరసనలపై (TMC supporters stage protest outside CBI office in Kolkata) రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ (Governor Jagdeep Dhankhar) స్పందించారు. సీబీఐ కార్యాలయంపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకుల్లా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. అక్కడి శాంతిభద్రతలను పునరుద్దరించాల్సిందిగా పోలీసులను గవర్నర్ కోరారు.

దీదీ దెబ్బకు మూడు పార్టీలు అవుట్, బెంగాల్లో కనుమరుగైన కాంగ్రెస్, వామపక్షాలు, మోదీ షా ద్వయానికి పశ్చిమ బెంగాల్లో చుక్కెదురు, ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ హ్యాట్రిక్

టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేయడంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భగ్గుమన్నారు. ‘‘ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారు. ఎలాంటి పద్ధతినీ అవలంబించలేదు. సీబీఐ నన్ను కూడా అరెస్ట్ చేయాలి’’ అంటూ మమత డిమాండ్ చేశారు.