Hyderabad, Feb 18: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) నడిపిస్తున్న ట్రూజెట్(Trujet) విమానయాన సేవలు నిలిచిపోయాయా? సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ట్రూజెట్ ఉందా? గత నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని వస్తున్న వార్తలపై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ట్రూజెట్(Trujet) కొంత నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే కానీ, సంస్థను మూసివేయడం లేదని ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుతానికి సర్వీసులను నిలిపివేశామని, త్వరలోనే ఒక ఇన్వెస్టర్ వస్తున్నారని ట్రూజెట్ తెలిపింది. రామ్‌ చరణ్‌ తో పాటూ ఆయన ఫ్రెండ్ ఉమేష్ కలిసి ట్రూజెట్ పేరుతో ఇండియాలో డొమెస్టిక్ విమానాలు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ట్రూజెట్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. తన స్నేహితుడు ఉమేష్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ సంస్థను(Turbo Mega Airways) ప్రారంభించారు రామ్ చరణ్. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో ఈ సంస్థను మొదలుపెట్టారు. ఈ సంస్థ ట్రూజెట్ (Trujet)పేరుతో విమాన సర్వీసులు నడుపుతోంది. జులై 12వ తేదీ 2015 లో ఈ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు నిరాటకంగా ఈ విమానాలు నడుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ సంస్థ నష్టాల్లో మునిగింది.

” ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనేది అబద్దమైన వార్తలు. ఇలాంటి వార్తలని నమ్మొద్దు. ఈ సంస్థలో పని చేసే టాప్ ఆఫీసర్స్ ఇద్దరు గతంలో రిజైన్ చేసి వెళ్లిపోయారు. కొత్త వారిని కూడా నియమించాము. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలోనే ఓ ఇన్వెస్టర్ కూడా రానున్నారు. ఆ ఇన్వెస్టర్ వచ్చాక కొత్త సీఈఓని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా(CEO) ఉమేష్ గారే కొనసాగనున్నారు. అంటూ ట్రూ జెట్ ప్రకటించింది.

Ramcharan Tej: రాజమండ్రిలో రాంచరణ్ తేజ్, చూసేందుకు ఎగబడుతున్న అభిమానులు, దోసకాయలపల్లిలో RC15 షూటింగ్..

వివిధ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కారణాల వల్ల ట్రూజెట్ విమానయాన కార్యకలాపాలకు తాత్కాలికంగా ఆటంకం కలిగింది. కొన్ని రోజులు మాత్రమే ఈ విమానాల్ని ఆపుతున్నాము. షార్ట్ నోటీసులో మళ్ళీ పునఃప్రారంభిస్తాము. నవంబర్ 2021 నుండి ఉద్యోగులకు ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని చెప్పే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వారికి పాక్షిక జీతాలు ఇస్తున్నాము. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చాము.” అని ఈ ప్రకటనలో తెలిపారు. ట్రూజెట్ సర్వీసులను ప్రారంభినప్పటి నుంచి పెద్దగా ఆదరణ లేదు. దీంతో దాన్ని మూసివేస్తున్నట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి.

Jr NTR on Rajamouli: రాజమౌళి దాన్నుంచి నన్ను కాపాడాడు, లేకుంటే నా జీవితం ఎలా ఉండేదో, జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు, ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా గడుపుతున్న ఆర్ఆర్ఆర్ టీం