TTE Performed CPR to Passenger

New Delhi, NOV 24: రైలులో ప్రయాణించిన ఒక వృద్ధుడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) అతడికి సీపీఆర్‌ చేశాడు. (TTE CPR to Passenger ) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో పలువురు డాక్టర్లు స్పందించారు. టీటీఈ చేసిన సీపీఆర్‌ విధానాన్ని విమర్శించారు. ఆమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన జరిగింది. జనరల్ కోచ్‌లో ప్రయాణించిన 70 ఏళ్ల వృద్ధుడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన టీటీఈ స్పృహలో ఉన్న ఆ ప్రయాణికుడికి సీపీఆర్‌ చేశాడు. నోటిని తెరిచి గాలి ఊదాడు. బీహార్‌లోని ఛప్రా రైల్వే స్టేషన్‌కు ఆ రైలు చేరిన తర్వాత ఆ వృద్ధుడ్ని ఆసుపత్రికి తరలించారు.

TTE Performed CPR to Passenger

 

కాగా, రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) ఈ వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసింది. 70 ఏళ్ల ప్రయాణికుడికి టీటీఈ సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాలు కాపాడినట్లు పేర్కొంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో పెద్ద చర్చకు దారి తీసింది. టీటీఈ చర్యను పలువురు ప్రశంసించారు.

Telangana: వీడియో ఇదిగో, నాలుగు పిల్లలు జన్మనిచ్చిన పెంపుడు కుక్క, ఊరి వాళ్లందరిని పిలిచి వేడుక జరుపుకున్న దాని యజమాని కుటుంబం 

మరోవైపు టీటీఈ చేసిన సీపీఆర్‌ విధానాన్ని కొందరు డాక్టర్లు తప్పుపట్టారు. స్పృహలో ఉన్న రోగికి సీపీఆర్‌ చేయడం చాలా తప్పని, ప్రమాదకరమని అన్నారు. సీపీఆర్‌ అనేది ప్రాణాలను రక్షించే ప్రక్రియ అని డాక్టర్లు పేర్కొన్నారు. సాధారణ వైద్యానికి స్పందించని లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయిన వ్యక్తులకు మాత్రమే సీపీఆర్‌ సిఫార్సు చేస్తారని తెలిపారు. సీపీఆర్‌ విధానంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్న ఈ వీడియో క్లిప్‌ను తొలగించాలని పలువురు డాక్టర్లు రైల్వేను కోరారు.

కాగా, సామాజిక కార్యకర్త డాక్టర్ విష్ణు రాజ్‌గాడియా కూడా దీనిపై స్పందించారు. ఈ సంఘటనతోపాటు సీపీఆర్‌పై ఆ టీటీఈకి ఇచ్చిన వైద్య శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని రైల్వేను కోరారు.