Lockdown in India | (Photo Credits: PTI)

New Delhi, Sep 28: మరో రెండు రోజుల్లో అన్‌లాక్ 4 నుంచి అన్‌లాక్ 5కి (from Unlock 4.0 to Unlock 5.0) దేశం అడుగులు వేయనున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సరికొత్త గైడ్ లైన్స్ ను (Unlock 5 Guidelines) నేడు విడుదల చేయనుంది. ఇప్పటికే దశలవారీగా మినహాయింపులు ఇస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం (Central government) ఈ సారి మరిన్ని మినహాయింపులు ఇవ్వనుంది. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది. ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు అన్‌లాక్‌ ప్రక్రియలు చేపట్టి, వివిధ మినహాయింపులు ఇచ్చింది.

ఇక లాక్‌డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తూ ఈ రోజు ప్రకటించబోయే అన్‌లాక్-5లో అక్టోబరు 31 వరకూ అమలు చేయాల్సిన గైడ్‌లైన్స్‌ను కేంద్ర హోం శాఖ (Home ministry) ప్రకటించనుంది. ఇదిలా ఉంటే దేశంలో అక్టోబరు మాసంలో పలు పండుగలు జరుగనున్నాయి. మరోవైపు కరోనా కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏఏ అంశాలపై మినహాయింపులు (ockdown relaxations) ఇవ్వాలనేది నిర్ణయించనుంది.

రైతు ఘోష..ఇండియా గేట్‌ వద్ద ట్రాక్టర్‌ను దగ్ధం చేసిన రైతులు, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కర్షకుల నిరసనతో భగ్గుమన్న దేశ రాజధాని

గత నెలలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మరికొన్ని అంశాలలో మినహాయింపులు ఇచ్చే విషయమై చర్చించింది. కొన్ని నిబంధనలతో స్కూళ్లు, సెలూన్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు తెరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులను తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అక్టోబరు నుంచి వీటిని తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారా లేదా అనే విషయం ఈరోజు తెలియనుంది.

ఒక్క‌రోజులో 1,039 మంది మృతి, దేశంలో 60 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, తాజాగా 82,170 మందికి కరోనా, 95,542కు చేరిన మరణాల సంఖ్య

ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి సినిమాహాళ్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే కొన్ని నిబంధనలతో సామూహిక కార్యక్రమాలు చేసుకునేందుకు కూడా అనుమతినిచింది.