బస్తీ, సెప్టెంబరు 24: తెలిసిన వాళ్లే కదా అని ఇంట్లోకి రానిస్తే దారుణానికి ఒడిగట్టారు కామాంధులు. భర్తకు ఫూటుగా మద్యం తాగించి, భార్యపై అత్యాచారం చేశారు. ఈ అవమానం భరించలేక భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు వారి ముగ్గురు చిన్ని పిల్లలు అనాధలుగా మారారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఓ గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కొన్ని గంటల తర్వాత, భర్తతో పాటు భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి భర్త మృతి చెందగా, మరుసటి రోజు గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రిలో అతని భార్య మరణించినట్లు బస్తీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), గోపాల్ కృష్ణ తెలిపారు.
బస్తీ జిల్లాలోని బాధితుల ఇంటికి సెప్టెంబరు 20, 21 మధ్య రాత్రి వారికి తెలిసిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వస్తూనే మద్యం తీసుకొచ్చిన నిందితులు బాధితురాలి భర్తకు బాగా తాగించారు. అతను మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరూ కలిసి అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే భర్తను చంపేస్తామని బెదిరించారు.దాంతో భర్త మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత బాధితురాలు అతడికి విషయం చెప్పింది.
Here's Videos
दिनांक 21.09.23 को थाना रुधौली, बस्ती में पति-पत्नी द्वारा जहर खा कर आत्महत्या का प्रयास किया गया, जिनकी एक दिन बाद मृत्यु हो गई, जिसपर मृतक के भाई से प्राप्त तहरीर के आधार पर दुष्कर्म के 01 अभियुक्त व 01 बाल अपचारी की गिरफ्तारी के संबंध में पुलिस अधीक्षक बस्ती द्वारा दी गई बाईट pic.twitter.com/LAqOHy05QE
— BASTI POLICE (@bastipolice) September 23, 2023
#BastiPolice थाना रुधौली पुलिस द्वारा दुष्कर्म के वांछित 01 अभियुक्त को गिरफ्तार व 01 बाल अपचारी को पुलिस संरक्षण में लिया गया- pic.twitter.com/n6ALT9Al7d
— BASTI POLICE (@bastipolice) September 23, 2023
అవమానం భరించలేక వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీడియోలో నిందితుల పేర్లను వెల్లడించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.వ్యక్తి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా, ఇద్దరు వ్యక్తులపై సెక్షన్లు 376 డి (గ్యాంగ్ రేప్) మరియు 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కృష్ణ తెలిపారు.
శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తాము విషం తాగి చనిపోతామని తల్లిదండ్రులు చెప్పారని దంపతుల పిల్లలు పోలీసులకు తెలిపారని పోలీసులు తెలిపారు.ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు, ఎనిమిది, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం, అత్యాచార ఘటనకు బాధితురాలి ఆధీనంలో ఉన్న భూమిని విక్రయించడంతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.