Zika Virus (Photo Credits: Flicr)

Kanpur, Oct 25: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో తొలి జికా వైర‌స్ కేసు (First Zika Virus Case Reported in Kanpur) వెలుగు చూసింది. కాన్పూర్ జిల్లాలో భార‌త వాయుసేన (ఐఏఎఫ్‌) అధికారి (IAF official tests positive)ఈ జికా వైర‌స్ బారిన ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఐఏఎఫ్ అధికారి చికిత్స కోసం కాన్పూర్ జిల్లాలోని వాయుసేన ఆస్పత్రిలో (Air Force Hospital,) చేరారు.

ఆయ‌న ర‌క్త న‌మూనాల‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం పుణెకు పంపారు. దీంతో ఆయ‌న‌కు జికా వైర‌స్ సోకింద‌ని నిర్ధారించారు. స‌ద‌రు ఐఏఎఫ్ అధికారితో కాంటాక్ట్ అయిన‌ట్లు భావిస్తున్న 22 మంది నుంచి ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి పుణెకు పంపామ‌ని కాన్పూర్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ నేపాల్ సింగ్ (Chief Medical Officer Nepal Singh) తెలిపారు. గ‌త ఏడాది జూలైలో కేర‌ళ‌లో 24 ఏండ్ల గ‌ర్భిణీకి జికా వైర‌స్ సోకింది. ఆగ‌స్టులో మ‌హారాష్ట్ర‌లో మ‌రో మ‌హిళ ఈ వైర‌స్ (Zika Virus) బారిన ప‌డ్డారు.

జికా వైరస్ దోమ కాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. నిజానికి ఎల్లో ఫీవర్, వెస్ట్‌నైల్ చికన్‌గన్యా, డెంగ్యూ వంటి వైరస్‌ల కుటుంబానికి చెందినదే జికా. ఆఫ్రికాలో కనిపించిన ఈ వైరస్. క్రమంగా లాటిన్ అమెరికా, పలు యూరప్ దేశాలకు విస్తరించింది. జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందులు లేవు. ఎబోలా వైరస్ సృష్టించిన బీభత్సం మర్చిపోకముందే కొన్ని తరాలను ప్రభావితం చేయగల ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నది.

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 14,306 మందికి కోవిడ్, కేరళలో తాజాగా 8,538 కేసులు నమోదు, 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసుకున్న భారత్

దోమల ద్వారా వ్యాపించే జికా అనే మహమ్మారి ఇప్పటికే 25 దేశాల్లో విస్తరించింది. దాదాపు 4వేల మంది అప్పుడే పుట్టిన శిశువుల భవితవ్యాన్ని అంధకారం చేసింది. వారిలో దాదాపు 50 మంది చిన్నారులు చనిపోయారు. ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ పై భారత దేశ కేంద్రప్రభుత్వ ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఇప్పటికి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వైరస్ నలభై లక్షల మందికి సోకే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా గర్భిణీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దోమల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది..

ఈ వైరస్ సోకిన మహిళ గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డలు అసాధారణమైన రీతిలో చిన్న తలలతో (మైక్రోసిఫలే) పుడతారని, కొన్ని సందర్భాల్లో శిశువుకు వృద్ధిపరమైన సమస్యలు తలెత్తుతాయని, మరింత తీవ్రతరమైతే మృతశిశువులే మిగులుతాయని పేర్కొంటున్నారు.ఇప్పటికే పలు కేసులలో ఉమ్మ నీరు ద్వారా గర్భంలోని చిన్నారులకు ఈ వైరస్ సోకింది. ఒక్క బ్రెజిల్‌లోనే 4వేల మంది గర్భిణులు చిన్న తలలతో కూడిన బిడ్డలకు జన్మనిచ్చారు.

మైక్రోసిఫలే అనే ఈ వ్యాధి లక్షణానికి చికిత్స కూడా లేదు.గర్భిణులకు ఈ వైరస్ సోకిందీ లేనిదీ తెలుసుకోవడం కూడా అసాధ్యం. కొలంబియాలో ఇప్పటివరకు 3,100మంది గర్భిణులకు సోకినట్లు ఆ దేశ అధ్యక్షుడు జువాన్‌ మాన్యుయేల్‌ సాంటోస్‌ శనివారం తెలియజేశారు. జికా వైరస్ కారణంగా పుట్టబోయే బిడ్డల యొక్క తలలు పూర్తి పరిమాణంలో అభివృద్ధి చెందవు.కొలంబియాలో మొత్తం 25,645 మంది జికా వైరస్‌ బారిన పడ్డారని, అందులో 3,177 మంది గర్భిణులు ఉన్నట్లు సాంటోస్‌ వివరించారు.

కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు

లైంగిక సంపర్కం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే హెచ్చరికలు ఉన్నప్పటికీ దీన్ని ధ్రువీకరించేందుకు ఇప్పటి వరకూ కేవలం రెండే కేసులు ఉదాహరణగా ఉన్నాయి. రక్తమార్పిడి ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది.ఈ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, వంటి మీద దద్దుర్లు, కండ్లు ఎర్రబారడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. దీనితో పరిస్థితి ముదిరిపోయేదాకా దీనిని గుర్తించడం కష్టమవుతుంది.అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట జికా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అధిక ఉష్ణోగ్రతతో దోమ మరిన్ని దోమల్ని ఉత్పత్తి చేస్తుందని వారు చెబుతున్నారు.

చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కన్పించకపోవచ్చును.కాకపోతే కొద్దిపాటి జ్వరం, వంటిపై దద్దుర్లు, కీళ్ళనొప్పులు, కళ్ళకలక (కళ్ళుఎర్రబడటం) వంతివి కనబడతాయి.కొంతమందికి కండరాలనొప్పులు కనిపించ వచ్చును. కొందరిలో తలనొప్పి ఉంటుంది.ఓకసారి వైరస్ సోకాక లక్షణాలు కనిపించటానికి కొద్ది రోజులు మొదలుకొని కొన్ని వారాలు పట్టవచ్చును.వైరస్ సోకితే అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ళవరకు ఉండవచ్చును.అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాపింపచేసె పరిస్థితిలో వారుంటారు.

వ్యాధి సోకినపుడు ఏర్పడె వ్యాధి లక్షణాలు ప్రాణాంతకం కాదు, సాధారణ తలనొప్పులు, వళ్లునొప్పులే, అయితే వ్యాధిసోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదకరమైనవి.అవి సరీర/దేహ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసేఆటో ఇమ్మ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చును.ఆతరువాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మొదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ వచ్చును.

చిక్సిత

వ్యాధిసోకిన తరువాత నిర్దిష్త చికిత్స ప్రక్రియ లేదు.ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికి ఇస్తారు.ఇప్ప‌టివ‌ర‌కు జికా వైర‌స్‌కి ప్ర‌త్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. బాగా విశ్రాంతి తీసుకోవాలి. శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కి గురికాకుండా ద్ర‌వ‌ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాలి.జ్వ‌రం, నొప్పుల‌ను త‌గ్గించే మందులు వాడాలి.యాస్ప్రిన్ గానీ, ఇంకా ఇత‌ర నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్ అంటే ఇబుప్రొఫెన్‌, న్యాప్రాక్సెన్ లాంటివి వాడకూడ‌దు. డెంగ్యూ, జికా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలేవ‌ర‌కు ఈ మందుల‌ను వాడ‌కూడ‌దు. అలా వాడితే ర‌క్త‌స్రావం ప్ర‌మాదం ఉంటుంది.మ‌రేదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్న‌వారు కూడా డాక్ట‌రుని సంప్ర‌దించాకే మందులు వేసుకోవాలి.

జికా ల‌క్ష‌ణాలున్న‌వారికి ఒక వారం వ‌ర‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ దోమ‌లు కుట్ట‌కుండా జాగ్ర‌త్తప‌డాలి. ఎందుకంటే ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ మొద‌టివారంలో ర‌క్తంలో జికా వైర‌స్ ఉంటుంది. దోమ‌లు మ‌ళ్లీ కుట్టిన‌పుడు ఆ వైర‌స్ వాటి ద్వారా తిరిగి మ‌రొక వ్య‌క్తికి సంక్ర‌మించ‌వ‌చ్చు. ఇన్‌ఫెక్ష‌న్‌కి కార‌ణ‌మ‌య్యే వైర‌స్‌ని మోసుకువెళ్లే దోమ అది కుట్టిన‌వారికి దాన్నివ్యాపింప‌చేస్తుంది. తగినంత విశ్త్రాంతి తీసుకోవాలి.ద్రవ ఆహారాని ఎక్కువ తీసుకోవడం వలన డిహైడ్రెసన్ తగ్గించవచ్చును.జ్వరాన్ని తగ్గించూ అసిటమినొపెన్ (acetaminophen) వంటి మందుమాత్రలు వాడాలి.అస్ప్రిన్, నాన్ స్టెరీయోడల్ (non-steroidal), నొప్పినివారణమందులు (anti-inflammatory ) వాడరాదు.