Lucknow, May 24: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రగిలిపోయిన అన్న సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి (man hacks brother, sister-in-law to death) చంపేశాడు. అంతటితో ఆగక వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి (chops off one-year-old nephew's limbs) కిరాతకంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భదోహి జిల్లాలోని కజియానాకు చెందిన నౌషద్ మటన్ వ్యాపారిగా (Uttar Pradesh man) జీవనం సాగిస్తున్నాడు.
నౌషద్, జమీల్ సోదరులు. నౌషద్ మటన్ వ్యాపారి. సోదరుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమ్ముడి కుటుంబాన్ని నాశనం చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం నౌషద్ తాను ఉపయోగించే మటన్ కత్తిని (butcher's knife) తీసుకుని జమీల్ (42), అతడి భార్య రూబీ (38)పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం జాలి కూడా లేకుండా ఏడాది వయసున్న తమ్ముడి కుమారుడిని కూడా పాశవికంగా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు బదోహీలోని దవాఖానకు తరలించగా వారు అప్పటికే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు.
ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన వెంటనే నౌషద్ తన తల్లితో పరారయ్యాడు. కుటుంబ కలహాలతో తన తమ్ముడు, మరదలుని కత్తితో కొట్టి చంపేశాడని, తర్వాత వారి కుమారుని కాలు, చెయ్యి నరికేశాడని భదోహి ఎస్పీ రామ్ బదన్ సింగ్ (Bhadohi Superintendent of Police Ram Badan Singh) తెలిపారు. హత్య అనంతరం నౌషద్ తన తల్లితో పరారయ్యాడని చెప్పారు. అతనికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య: ఇక ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ తాలుకాలోని బారియా నిశారు గ్రామంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నిశారు గ్రామానికి చెందిన రమేశ్ కుమార్ (35) అనే వ్యక్తి తన మేనల్లుడు పవన్‌తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే, మామా అల్లుళ్ల మధ్య భూ విషయంలో గొడవలున్నాయి. ఈ క్రమంలో అయితే.. మామా అల్లుడి మధ్య చాలా రోజులుగా ఓ భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ శనివారం రాత్రి రమేశ్ కుమార్, అతని భార్య జ్యోతి, ఇద్దరి కొడుకులు, కూతురు పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, ఎస్ఎస్పీ శైలేశ్ కుమార్ పాండే, ఎస్పీ శైలేంద్ర సింగ్ ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు బృందాలు గాలిస్తున్నాయని శైలేష్ కుమార్ పాండే తెలిపారు. హత్యకు గురైన చిన్నారుల వయస్సు 4, 6, 8 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.