Dehradun, April 4: ఉత్తరాఖండ్ చమోలిలో అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 67 హెక్టార్ల అడవి (Uttarakhand Forest Fire) బుగ్గయిపోయింది.దీని ఖరీదు దాదాపు రూ 37 లక్షలు వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మంటలు అడవిని దాటి నగరానికి చేరువగా వస్తున్నాయి.
ఉత్తరా కాశిలోని వరుణవత్ పర్వతంపై మంటలు , గర్హ్వాల్ చౌరేస్ అగ్ని కీలలు శ్రీనగర్ చేరుకున్న తరువాత హెచ్చరికలు జారీచేశారు. దీంతో పాటు నైనిటాల్‌లో 20 అడవులు కూడా తీవ్ర మంటల్లో ఉన్నాయి. కాగా ఉత్తరాఖండ్‌లో డిసెంబర్ నుంచి అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. మంటలను ఆర్పడానికి అటవీ శాఖ ఇప్పుడు హెలికాప్టర్లను పంపాలని రక్షణశాఖను కోరింది.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, నవంబర్-జనవరి మధ్య ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా అడవి మంటలు సంభవించాయి. నవంబర్-జనవరి వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో 2,984 అడవి మంటలు సంభవించాయి. వీటిలో 470 ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాయి.
Here's ANI Update
Uttarakhand: 4 persons & 7 animals died in fire that broke out in 62 hectares of forest area in last 24 hours
"12,000 guards & fire watchers of state forest dept deployed to douse fire. Fire destroyed property worth Rs 37 lakhs so far," says Principal Chief Conservator (fire) pic.twitter.com/nklHovXDKZ
— ANI (@ANI) April 4, 2021
గత శీతాకాలంలో 39 సంఘటనలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 27 వరకు ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో 787 అగ్ని ప్రమాదాలు జరిగాయని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ మన్ సింగ్ తెలిపారు. మార్చి 27 తరువాత, అగ్ని ప్రమాదం క్రమంగా పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1,299 హెక్టార్ల అటవీ భూములు మంటల్లో చిక్కుకున్నాయి.
అల్మోరా, పిథోరాగఢ్ జిల్లాల సమీపంలో టోలి అడవుల్లో కూడా మంటలు కొనసాగుతున్నాయి. కర్ణాటక, ఖోలా, పాపారా శైలి అడవులు, బాగేశ్వర్‌లోని నాడియాగావ్, దుగనకూరి అడవులు, గడినాగ్ బుడెరా, గదేరా, టోక్ మణిఖెట్ అడవులు మంటల్లో ఉన్నాయి. నైనిటాల్‌లో ఇరవైకి పైగా అడవుల్లో మంటలను అటవీ శాఖ, అగ్నిమాపకశాఖ అర్పేశాయి. తెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్, తెరి జిల్లాలో కూడా అనేక అటవీ మంటలు చెలరేగాయి.