Shillong, Mar 01: దేశ రాజధానిలో CAA నిరసనలు మిన్నంటిన విషయం విదితమే. ఇప్పటికే సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు, అల్లర్లలో దాదాపు 42మంది చనిపోయారు. అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నిరసనలు ఈశాన్య రాష్ట్రాలను కూడా తాకాయి. తాజాగా మేఘాలయలోకి (Meghalaya) నిరసనలు ప్రవేశించాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో (Shillong) చేతిలో రాడ్లు, కర్రలతో ముష్కరులు వీరవిహారం చేస్తున్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రాజకీయాల్లోకి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా (Anti-CAA protests) మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో భారీ ఎత్తున ఆందోళనకారులు నిరసనలకు దిగుతున్నారు. ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (KSU), నాన్ ట్రైబల్స్ మధ్య ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. షిల్లాంగ్‌లోని జైయాప్, లాంగ్సింగ్, సోహ్రా (చిరపుంజి) ప్రాంతాల్లో చోటు చేసుకున్న అల్లర్లలో దాదాపు పది మంతి కత్తిపోట్లకు గురయ్యారు.
తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని ఇచమటి ప్రాంతంలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌ను హతమార్చడం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోనళలకు గురి చేసింది. దీంతో ఇంటర్నెట్, SMS సేవలను 48 గంటల పాటు బ్యాన్ చేశారు. ఘర్షణల్లో పలువురు KSU సభ్యులు, పోలీసులు గాయపడ్డారు. వాహనాలను ఓ వర్గానికి చెందిన ముఠా ధ్వంసం చేసింది. సంఘటన జరిగిన అనంతరం షిల్లాలో కర్ఫ్యూ విధించారు.
కలకత్తాలో అమిత్‌షా, గో బ్యాక్ అంటూ వామపక్షాలు
ఈ అల్లర్లు జరిగిన వెంటనే మేఘాలయ సీఎం కాన్నడ్ కే సంగ్మా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలంతా హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లర్లలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. కాగా ఇక్కడి రాష్ట్ర అసెంబ్లీ..ILP అమలు కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కానీ హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అక్కడ KSU, ఇతర గిరిజన సంఘాలు ILP కోసం ఒత్తిడి తెస్తున్నాయి.