Chennai, Dec 16: మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం చెన్నైలో భారీ వర్షం (Heavy rain) కురిసింది. ఈ వర్షం (Heavy rain lashes Tamil Nadu's Chennai) కారణంగా ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొన్న సంభవించిన వరద నుంచి తేరుకోకముందే మరోసారి వర్షం పడటంతో చెన్నై వాసులు (Heavy rain lashes Tamil Nadu) తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు నేటి నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు డిసెంబర్ 17వ తేదీన కేరళ, లక్షద్వీప్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ రెండు రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో శుక్రవారం దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వర్షాల సంగతి ఇలా ఉంటే.. రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లో ఏజెన్సీ ప్రాంతం.. శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
Here's Chennai Rain Video
#WATCH | Heavy rain lashes Tamil Nadu's Chennai pic.twitter.com/lrN3tdAVTo
— ANI (@ANI) December 15, 2023
మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చలి పులి వణికిస్తోంది. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తోంది. తుఫాన్ తర్వాత నుంచి ఈ చలి వాతావరణం మరింతగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభఆవం కూడా ఉంటోంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటున్నాయి. తెలంగాణలో చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉండనుంది. హైదరాబాద్ నగరంలో చూస్తే… శనివారం ఉదయం వేళ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. తూర్పు, ఆగ్నేయం దిశ నుంచి గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది