FIR against Suvendu Adhikari (Photo-ANI)

Kolakata, June 6: వెస్ట్ బెంగాల్​ ప్రతిపక్ష నేత, బీజేపీ లీడర్​ సువేందు అధికారిపై (FIR against Suvendu Adhikari) కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్ పూర్బ మేదినిపూర్ జిల్లా కాంతి మున్సిపాలిటీ కార్యాలయంలో సహాయ సామగ్రి (రిలీఫ్ మెటీరియల్) బలవంతంగా ఎత్తుకెళ్లారనే ఆరోపణపై బీజేపీ నేత సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం (brother Soumendu for stealing relief material) చేశారని..కంతి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డ్‌ సభ్యుడు రత్నదీప్‌ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి ఇద్దరూ మే 29న కార్యాలయ గోడౌన్‌లోకి అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకువెళ్లారని మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక సువేందు అధికారి ముఖ్య అనుచరుడు రేఖాల్​ బెరాను కోల్​కతా పోలీసులు అరెస్ట్ చేశారు. నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించి ప్రజలను మోసగించిన ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

చిల్లర రాజకీయాలు చేయొద్దు, బెంగాల్ ప్రజల కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికైనా రెడీ, చీఫ్‌ సెక్రటరీ బదిలీ రద్దు ఆపండి, బీజేపీ పార్టీపై విరుచుకుపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

మానిక్‌తలా పోలీసు స్టేషన్‌లో శనివారంనాడు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బెరా మరికొందరు కలిసి ఒక వ్యక్తి నుంచి రూ.2 లక్షలు తీసుకుని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. కల్యాణ్‌గడ్‌లోని అశోక్‌‌నగర్ వాసి సుజిత్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 120బి/420/467/468/471 కింద రాఖల్ బెరాపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మరికొందరికి కూడా బెరా ఉద్యోగాల ఆశ చూపించాడని, ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడనే మరికొన్ని ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయని తెలిపారు. సోమవారంనాడు కోర్టు ముందు బెరాను హాజరుపరచనున్నట్టు చెప్పారు. ఇరేగేషన్ శాఖలో అవకతవకలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన క్రమంలో బెరా పేరు వెలుగుచూసింది.

Here's ANI Update

ఇక మొన్నటి ఎన్నికల్లో తృణముల్ మాజీ నేత సువేందు..ముఖ్యమంత్రి మమతపై నెగ్గిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తుపాన్​ సమీక్షలో ఈయన కూడా పాల్గొనడంతోనే.. దీదీ ఎగ్గొట్టిందన్న వాదన కూడా వినిపించింది. ఇదిలా ఉంటే బీజేపీ నేత‌ ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాన్షు రాయ్ తాను మమతా పార్టీ నుంచి తప్పుకోలేదని పదేపదే చెబుతున్నారు. తాజాగా ఆయన...తాము కష్ట సమయాల్లో ఉన్న‌ప్పుడు త‌మ క్షేమ స‌మాచారం గురించి వాక‌బుచేసినందుకు మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు. దీనికి ముందు ఆయ‌న ఓట‌మి విష‌యంలో బీజేపీ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని సూచించారు. బీజేపీని విడిచిపెట్టి తిరిగి టీఎంసీ గూటికి చేరాల‌ని ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిలో ముకుల్ రాయ్, దీపేందు విస్వాస్, సోనాలి గుహ, శ‌ర‌ళా ముర్ము వంటి వారు ఉన్నట్లు సమాచారం.