Image used for representational purpose (Photo Credits: Pixabay)

Kolkata, June 20: పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులను ఓ ఇంటర్‌ విద్యార్థి అత్యంత కిరాతకంగా (Teen Killed 4 Members of Family) కడతేర్చాడు. ఈ ఘటన జరిగి సుమారు నాలుగు నెలలు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. మాల్డా జిల్లాలోని కలియాచక్‌లో నిందితుడు ఆసిఫ్ మొహమ్మద్ తన కుటుంబానికి కాలయముడిగా మారాడు. నాలుగు నెలల క్రితం (Bodies Buried in Godown for 4 Months) ఆసిఫ్‌ తన తల్లి, తండ్రి, సోదరితో పాటు 62 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేశాడు. మృతదేహాలను ఇంటి గోడౌన్‌లో పూడ్చిపెట్టాడు

కాగా ఈ సంఘటన నుంచి నిందితుడి సోదరుడు ఆరిఫ్ మొహమ్మద్ తప్పించుకున్నాడు.. అయితే ఆసిఫ్ అకృత్యాన్ని ఎట్టకేలకు బయటపెట్టాలని నిర్ణయించుకున్న అతని సోదరుడు.. కాలియాచోక్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించటంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 28 న, ఆసిఫ్ కుటుంబ సభ్యులందరికీ నిద్ర మాత్రలు కలిపిన శీతల పానీయాలను అందించాడు. వారు అపస్మారక స్థితిలో చేరడంతో, అతి కిరాతకంగా హత్య చేసి ఆ ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టాడు.

పట్టపగలే పండ్ల వ్యాపారిపై ఆరుగురు యువకులు కాల్పులు, తృటిలో తప్పించుకున్న వ్యాపారి కైలాష్‌ మీనా, రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్‌లో ఘటన, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు

దీంతో పోలీసులు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని తెలిపారు. ఆసిఫ్ నిత్యం తన తండ్రి డబ్బులకోసం డిమాండ్ చేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ సమక్షంలో, గోడౌన్ యొక్క అంతస్తును తవ్వి, అక్కడ నుండి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మాల్డా మెడికల్ కాలేజీకి పంపారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఫిబ్రవరి చివరలో తాను నలుగురిని చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అతను వారు తాగే శీతల పానీయాలలో డ్రగ్స్ కలిపినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే వారిని బావిలోకి తోశాడు. వారు చనిపోయారని నిర్థారించుకున్న తరువాత మృతదేహాలను బావి నుండి బయటకు తీసి, వాటిని ఒకదాని తరువాత ఒకటి గోడౌన్ వద్ద పూడ్చి పెట్టాడు. గోడౌన్ గేట్ ప్రవేశద్వారం దగ్గర ఉందని, లోపల తెరవడానికి గేట్ లేదని, అందువల్ల మృతదేహాలను గోడౌన్ లోపలికి తీసుకురావడానికి అతను ఒక సొరంగం తవ్వినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. స్థానిక ప్రజలకు ఏమీ తెలియని విధంగా సొరంగం తయారు చేయబడింది" అని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

ప్రియుడితో రాసలీలలు, మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి ప్రియుడుతో కలిసి చంపేసిన భార్య, గుండెపోటుతో మరణించాడని కట్టు కథలు, నిజం తెలియడంతో ఇద్దరూ పరార్

నిందితుడు ఇంటికి ఎవరినీ రానిచ్చేవాడు కాదని..ఆహారం మొత్తం ఆన్ లైన్ ద్వారానే ఆర్డర్ చేసేవాడని స్థానికులు తెలిపారు. తన కుటుంబం గురించి నాలుగు నెలలుగా ఎటువంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు.కాగా కొత్తగా కొన్న ఫ్లాట్‌లో తన కుటుంబం కోల్‌కతాకు మారిందని తన పొరుగువారికి చెప్పినట్లు ఆసిఫ్ ఒప్పుకున్నాడు. ఈ హత్యల వార్త వ్యాపించడంతో, ఇంటి దగ్గర భారీ గుంపు గుమిగూడింది.

పొరుగువారి ప్రకారం, ఆసిఫ్ తన గ్రామానికి దూరంగా కాశ్యచక్ లోని ఒక ప్రైవేట్ పాఠశాల నుండి తన పదవ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన తరువాత, తల్లిదండ్రులు అతనికి ల్యాప్‌టాప్ కొనడానికి నిరాకరించడంతో అతను తన ఇంటి నుండి పారిపోయాడని వారు చెప్పారు.అతను తిరిగి వచ్చిన తరువాత, అతని తల్లిదండ్రులు అతనికి ఖరీదైన కంప్యూటర్ మరియు ఇతర గాడ్జెట్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఇంకా డబ్బులు కావాలని అడగడం వారు ఇవ్వకపోవడం వల్ల ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తోంది.