New Delhi, June 23: దేశంలో మహిళలకు భద్రత అనేది కరువయిపోతోంది.చివరకు తీర్పునిచ్చే న్యాయస్థానాల్లో కూడా రక్షణ ఉండటం లేదనేదానికి నిదర్శనమే ఈ తాజా ఘటన. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో రూస్ అవెన్యూ కోర్టులో (Women Raped Inside Court) ఓ మహిళపై అత్యాచారం జరిగింది. కోర్టు గదిలో సిబ్బంది ఒకరు 38 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని పేర్కొంటూ పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసింది. కోర్టు సిబ్బందిలో ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొంది. ముద్దులతో 24 మందికి కరోనా అంటించాడు, ముద్దుపెట్టి కోవిడ్-19 నయం చేస్తానని చెప్పిన బాబా కరోనాతో మృతి, బాధితులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376 కింద నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని (Delhi''s Rouse Avenue Court) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అదేవిధంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సంజయ్ భాటియా తెలిపారు. కోవిడ్-19 (COVID-19 pandemic) కారణంగా కోర్టులు మూసివేయడంతో నిందితుడు దీన్ని అవకాశంగా మలుచుకుని ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిని కళ్యాణ్‌పురి ప్రాంతంలో నివసిస్తున్న రాజేంద్ర సింగ్‌గా గుర్తించారు. ఈ విషయంలో మరింత దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు.