Ram Madhav, BJP (photo-ANI)

New Delhi, May 21: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామజన్మభూమి ( Ayodhya Ramjanmabhoomi) స్థలం చదును చేస్తుండగా దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. బయటపడిన విగ్రహాల్లో పుష్ప కలశం, ఐదడుగుల శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్రరాతి స్థంభాలు ఉన్నాయి. రామజన్మభూమిలో ఎలాంటి సమాధులు లేవు, సమాధులపై రామాలయం ఎలా కడతారనే ముస్లీంల లేఖకు వివరణ ఇచ్చిన అయోధ్య డీఎమ్

దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర (Sri Ram Janmabhoomi Tirth Kshetra) ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో ఈ నెల 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలం చదును చేస్తున్నారని, మొత్తం పది మంది కార్మికులు ఈ పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు.

ఈ విగ్రహాలు బయటపడటంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ (Ram Madhav) స్పందించారు. ఇప్పుడే కాదు గతంలో జరిపిన తవ్వకాల్లోనూ విగ్రహాలకు సంబంధించిన అవశేషాలు, ఆధారాలు లభించాయన్నారు. చంపత్ రాయ్ ప్రస్తుత ప్రకటన ద్వారా అది మరోమారు స్పష్టమైందని రామ్ మాధవ్ తెలిపారు.

Here's ANI Tweet

ఇప్పుడు కూడా ఆధారాలు లభిస్తున్నాయని చెప్పారు. అయోధ్యలో పని కొనసాగుతోందని, తవ్వకాలు జాగ్రత్తగా జరుపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ ప్రక్రియ ట్రస్ట్ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉందని రామ్ మాధవ్ చెప్పారు. లాక్‌డౌన్ 5 ఉంటుందా లేక ఇదే లాస్ట్ అవుతుందా? ప్రారంభమైన విమానాలు, రైళ్లు, షాపులు, ఇండియా సాధారణ స్థితికి చేరుకున్నట్లేనా..?

కాగా అయోధ్య రామజన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వివాదం కొన్నేళ్లపాటు సాగింది. అయోధ్యలో మరో చోట మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమి సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.