Xiamen Airlines Viral News: చల్ల గాలి కోసం విమాన కిటికీ తెరిచిన మహిళ, హడలిపోయిన సిబ్బంది, నిలిచిపోయిన విమానం, వైరల్ అవుతున్న వీడియో
Xiamen Airlines Passenger Opens Plane Door For Fresh Air (Photo Credits: Wikimedia Commons)

Beijing, September 27:  అదేదో సినిమాలో అల్లరి నరేశ్ ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతాడు, అందరినీ తోసుకుంటూ వెళ్లి ఒక సీట్ మీద కర్చీఫ్ వేసి, ఆ సీట్ నాది అంటాడు. దీంతో షాక్ అవడం మిగతా ప్రయాణికుల వంతు అవుతుంది. కొంతమంది ప్రయాణికులు చేసే చర్యలు విచిత్రంగా అనిపించినా, విపరీతంగా నవ్వు తెప్పిస్తాయి. సరిగ్గా అలాంటి ఫన్నీ సంఘటన మరో చోట జరిగింది. అది ఎయిర్ బస్ అనుకుందో ఎర్రబస్ అనుకుందో విమానం కిటికీ తెరిచిపెట్టింది ఆ మహిళా ప్రయాణికురాలు.

వివరాల్లోకి వెళ్తే, అది చైనాలోని వుహన్ ప్రాంతం నుంచి గన్సూ వెళ్లాల్సిన షియామెన్ ఎయిర్ జెట్ (Xiamen Airlines)  విమానం. ప్రయాణికులు అంతా ఎక్కారు, బోర్డింగ్ కంప్లీట్ అయింది. ఇక ఎయిర్ హోస్టెసెస్ కూడా ప్రయాణికులకు చేయాల్సిన సూచనలన్నీ చేసేశారు. కెప్టెన్ కూడా రెడీ, ఫ్లెట్ టేకాఫ్ కు సిద్ధమవుతుందనగా ఎమర్జెన్సీ కిటికీ పక్కన కూర్చున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఆ కిటికీని తెరిచింది. దీంతో అలార్మ్ మోగి ఫ్లైట్ నిలిచిపోయింది, వెంటనే సిబ్బంది వచ్చి 'కిటికీ ఎందుకు తెరిచారు?' అని ఆ మహిళను ప్రశ్నించగా, అందుకు ఆమె 'చాలా ఒక్కపోతగా ఉంది, చల్లగాలి వస్తుందని తెరిచాను' అని చెప్పడంతో విమాన సిబ్బంది జుట్టు పీక్కున్నారు. వెంటనే ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ తతంగాన్నంతా మిగతా ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి.  వెనక్కి ప్రయాణించిన చిరంజీవి విమానం, చదవండి.

ఇదిగో ఆ ఘనకార్యానికి సంబంధించిన వీడియో: 

సెక్యూరిటీ సిబ్బంది ఆ మహిళను విమానం నుంచి కిందకు దించేసి విచారించారని చైనా స్థానిక మీడియా పేర్కొంది. ఆ తర్వాత విమానంలోని ప్రయాణికులకు అటువంటి చర్యలు చేయకూడదు అని మరోసారి ఇన్స్ స్ట్రక్షన్స్ ఇచ్చారు, దీంతో గంట లేటుగా విమానం టేకాఫ్ అయింది.  వాటర్ కోచ్ ప్రత్యేకతలు చూస్తే ఔరా అంటారు!

అయితే ఇలాంటి సంఘటనలు కొత్తేమి కాదని , చాలా సార్లు చాలా సంఘటనలు జరిగాయని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు.