New Delhi, January 27: నిరసనలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం అస్సాంలో (Assam) కీలక పరిణామం చోటు చేసుకుంది. అస్సాంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్న బోడోల (Bodoland) తో కేంద్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తీవ్రవాద గ్రూపులైన నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ తో (All Bodo Students Union ) కేంద్రం ఒప్పందం (Bodo Peace Accord) చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం బోడో తెగ వారికి రాజకీయంగా , ఆర్థిక హక్కులు కల్పించేందుకు దారులు ఏర్పడ్డాయి. ఈ ఒప్పందంపై ఎన్‌డీఎఫ్‌బీ (NDFB), ఏబీఎస్‌యూ ప్రతినిధులు, అసొం ముఖ్యమంత్రి సరబానంద్ సోనోవాల్, హోంశాఖ కార్యదర్శి సత్యేంద్ర గార్గ్, అసోం సీఎస్ కుమార్ సంజయ్ కృష్ణన్ లు సంతకాలు చేశారు. ప్రత్యేక బోడోలాండ్ కోసం కొన్నేళ్లుగా ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో అస్సాంలో ఉద్యమం జరుగుతోంది.
Here's ANI Tweet
Delhi: Government of India signs tripartite agreement with representatives of all factions of banned organisation National Democratic Front of Bodoland (NDFB) at Ministry of Home Affairs (MHA); Home Minister Amit Shah and Assam CM Sarbananda Sonowal present pic.twitter.com/Knyebw7WSo
— ANI (@ANI) January 27, 2020
కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఈ ఒప్పందం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), అస్సాం సీఎం సరబానంద్ సోనోవాల్ (Sarbananda Sonowal) ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు. అస్సాంలో బోడో తీవ్రవాదులు ఎక్కువ. ఈ ఒప్పందంతో బోడో ప్రాంతం, అస్సాం అభివృద్ధి సాధిస్తాయని అమిత్ షా తెలిపారు. ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం అని షా (Home Minister Amit Shah) అన్నారు.
బీజేపీకి ఓటు వేస్తే దేశం సురక్షితంగా ఉంటుంది
ఈ ఒప్పందం అమలుకు అన్ని విధాల ప్రయత్నిస్తామన్నారు. అన్ని వాగ్ధానాలను అమలు చేస్తామన్నారు. అస్సాం, బోడో ప్రజలకు బంగారు భవిష్యత్తునిస్తుందన్నారు. ఈనెల 30వ తేదీన 1550 మంది బోడో క్యాడర్ ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. వాళ్లు 130 ఆయుధాలను సరండర్ చేయనున్నారు. కోక్రజా, చిరాంగ్, బక్సా, ఉదల్‌గిరి జిల్లాలు బోడో ప్రాంతంలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే బోడోలతో శాంతి ఒప్పందంపై సంతకాలను వ్యతిరేకిస్తూ నాన్ బోడో సంస్థలు 12 గంటల పాటు అస్సాం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆగిపోయిన బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌కు బోడో ఉద్యమం ఊపిరిపోసిందని ఇప్పుడు శాంతి ఒప్పందం చేసుకోవడమంటే ఉద్యమాన్ని పక్కకు పెట్టినట్లే అని ఆ సంస్థలు చెప్పుకొచ్చాయి. కొక్రాఝార్, బక్సా, చిరాంగ్, మరియు ఉదల్‌గురి జిల్లాలో బంద్ కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని సమాచారం.
అస్సాంలో బాంబు పేలుళ్లు, ఉలిక్కిపడిన దేశం
బోడో శాంతి ఒప్పందంకు నిరసనగా కొక్రాఝార్ జిల్లాలో ఆందోళనకారులు టైర్లకు నిప్పు పెట్టారు. అయితే ఎలాంటి హింసా జరగలేదని పోలీసులు తెలిపారు. ఆల్‌కోచ్ రాజ్‌భోంగ్షీ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ బోడో మైనార్టీ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ ఆదివాసి స్టూడెంట్స్ యూనియన్, ఒబోరో సురక్షా సమితి, కలిత జనగోష్టి స్టూడెంట్స్ యూనియన్ వంటి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బోడోలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్స్‌లో ఉంటున్న నాన్ బోడో సంఘాలను కూడా చర్చలకు పిలువాలని వారు డిమాండ్ చేశారు. ఒప్పందంను చదివి తమ ఒపీనియన్ కూడా తీసుకోవాలని డిమాండ్ చేశాయి.