Union Home Minister and BJP President Amit Shah | File Photo

New Delhi, January 27: ఢిల్లీలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ( Delhi election 2020) గెలిచేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ-ఆప్ (BJP-AAP) పార్టీల మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మీద విమర్శల దాడి చేస్తోంది. ముఖ్యంగా హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అయితే సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind kajriwal) మీద మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం

ఢిల్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్‌ (Shaheen Bagh) వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజధాని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా నిప్పులు చెరిగారు.

Here's The ANI tweet

NRCకి మరియు NPRకి మధ్య ఎలాంటి సంబంధం లేదు

షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్‌ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని పేర్కొన్నారు. బీజేపీకి మీరు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.

ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం, గురుద్వారా దాడిపై కాంగ్రెస్ మౌనమెందుకు..?

కాగా సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో వందలాది మంది గత 30 రోజులుగా చేపట్టిన నిరసనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా షహీన్‌బాగ్‌ ఘటనను అమిత్‌ షా ఆక్షేపించడాన్ని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా సాగే ఆందోళనలను తోసిపుచ్చడం అంటే మహాత్మాగాంధీ ప్రవచించిన అహింసా వాదాన్ని తోసిపుచ్చడమేనని వ్యాఖ్యానించారు

ప్రశాంత్ కిషార్ కౌంటర్

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఢిల్లీపై ప్రేమతో ఓటు వేయండి. ప్రస్తుతం ప్రభుత్వంపై ఎలాంటి అసహనంలేదు. సోదరభావం, స్నేహ భావానికి ఎలాంటి ప్రమాదంలేదు’ అని అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చారు.

Here's  Prashant Kishor Tweet

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు ప్రశాంత్‌ కిషోర్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఆయన.. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు రాజకీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నారు.