Delhi CM Aravind Kejriwal vs Home Minister Amit Shah (Photo-PTI)

New Delhi, January 25: ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) గెలుపు కోసం అన్ని పార్టీల అధినేతలు దేశ రాజధానిలో పాగా వేసారు. రోడ్ షోలలో మాటాల తూటాలను పేలుస్తున్నారు. ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020 లో ప్రధానంగా బీజేపీ, ఆప్ పార్టీల మధ్యనే పోటీ ( BJP vs AAP) నడుస్తోందని తెలుస్తోంది.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని (Delhi CM Arvind Kejriwal) కిందకు దించి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు బీజేపీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు హామీల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో (Delhi) మాటల తూటాలు పేలుతున్నాయి.

ఢిల్లీ సీఎంపై అమిత్ షా మాటల తూటాలు

2015లో ప్రజలు నమ్మి కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఆ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనీ అమిత్ షా (Amit Shah) దుయ్యబట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి (BJP) అధికారమిస్తే ఢిల్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా పేర్కొన్నారు.

2వసారి ఆప్ అధికారంలోకి వస్తుందా?,బీజేపీ చరిత్రను తిరగరాస్తుందా?

ఢిల్లీలో మూడొంతుల మంది పాకిస్తాన్ (Pakistan) నుంచి వచ్చిన శరణార్థులే ఉన్నారనీ.. వారికి పౌరసత్వ ప్రసాదించే చట్టాన్ని కాంగ్రెస్, (Congress) ఆమ్ ఆద్మీ పార్టీలు (Aam Aadmi Party) వ్యతిరేకిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. సీఏఏకి (CAA) వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు ముస్లింలను (Muslims) రెచ్చగొడుతూ ఢిల్లీలో అల్లర్లను ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.

న్యూఢిల్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్

వాళ్లు ముస్లింలను రెచ్చగొట్టడం, అల్లర్లకు ప్రేరేపించడం మొదలు పెట్టారు. తాము షాహీన్ బాగ్ ఆందోళనకు (Shaheen Bagh protests) మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటికీ చెబుతున్నారు. నెలరోజులుగా కాంగ్రెస్ నేతలు షాహీన్‌ బాగ్‌ను సందర్శిస్తూనే ఉన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా కూడా షాహీన్ బాగ్ ప్రజలకు అండగా ఉంటామని చెబుతున్నారని పేర్కొన్నారు.

అరవింద్ కేజ్రీవాల్‌పై 88 మంది అభ్యర్థుల పోటీ

సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ సీటుపై అందరి దృష్టి పడింది. కేజ్రీవాల్ తన నామినేషన్ దాఖలు చేయగానే, అతనిపై పోటీ చేసేందుకు 88 మంది ఎన్నికల బరిలోకి దూకారు. వీరిలో డ్రైవర్, కండక్టర్లతో పాటు సన్యాసులు కూడా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ప్రతిపక్షాలకు షాకిచ్చిన అరవింద్ కేజ్రీవాల్

సీఎం కేజ్రీవాల్‌పై పోటీ చేసేందుకు సిద్ధమైన 88 అభ్యర్థుల నామినేషన్ పత్రాల స్క్రూటినీ అనంతరం 34 మంది పోటీకి అర్హులుగా తేలారు. వివిధ కారణాలతో 54 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా చిట్ట చివరకు ఫైనల్ జాబితాలో న్యూఢిల్లీ సీటు నుంచి సీఎం కేజ్రీవాల్‌పై 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

ఢిల్లీలో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు

కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న వారిలో కొంతమంది విచిత్రమైన పార్టీల నుంచి బరిలోకి దిగారు. వీటిల్లో ఆప్ పేరుతోనే ఓ పార్టీ తెరపైకి వచ్చింది. అన్‌జాన్ ఆద్మీ పార్టీ పేరుతో వచ్చిన ఈ పార్టీ నుంచి శైలేంద్ర సింగ్ ఢిల్లీ సీఎం మీద పోటీ చేస్తున్నారు. అలాగే భారతీయ ‘లోక్‌తాంత్రిక్ పార్టీ’, ‘హిందుస్తానీ అవామ్ మోర్చా’, ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా’, ‘విజయ్ భారత్ పార్టీ’, ‘భారతీయ సామాజిక న్యాయ్ పార్టీ’, ‘రైట్ టూ రీకాల్ పార్టీ’, ‘బహుజన్ ద్రవిడ్ పార్టీ’, ‘జన్ ఆవాజ్ వికాస్ పార్టీ’, ‘విశ్వ శక్తి పార్టీ’, ‘అహీర్ నేషనల్ పార్టీ’, ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’, ‘రాష్ట్రీయ రాష్ట్రవాదీ పార్టీ’, ‘జనాధాన్ నేషనల్ పార్టీ’, రాష్ట్రీయ జనసంభావనా పార్టీ’, ‘యువ కాంత్రికారీ పార్టీ’, ‘మజ్దూర్ ఏక్తా పార్టీ’ ఇలా పలు పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాయి.

పని చేసిన చోటల్లా గెలుపు బావుటా ఎగురవేస్తున్న పీకే టీం

భారత్ మాతా కావాలా? జిన్నా కావాలా : ప్రకాశ్ జవదేకర్

ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో ఏర్పాటు చేపిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఢిల్లీ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తోన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (Union minister Prakash Javadekar) మాట్లాడుతూ.. పాకిస్తాన్ జిన్నా కావాలో? భారతమాతకు జై అంటారో (Jinnah wali Azadi or Bharat mata ki jai) ఢిల్లీ ఓటర్లు నిర్ణయించుకోవాలని జవదేకర్‌ ఢిల్లీ ఓటర్లకు ప్రశ్న వేసారు.

Here's ANI Tweet

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో డిసెంబర్‌ నుంచి నిరవధిక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ.. ఆ ఉద్యమం వెనుక చీకటి శక్తులు ఉన్నాయని, ఆ చీకటి శక్తులకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అండగా నిలిచాయని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాగ్ లో నిరసనకారులు.. జిన్నా కోరిన స్వాతంత్ర్యం(జిన్నా వాలీ ఆజాదీ) అంటూ నినాదాలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్

బీజేపీ నేత కమల్ మిశ్రా

ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్‌తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం:అమిత్ షా

అమిత్ షా కౌంటర్

కేజ్రీవాల్ 500 స్కూళ్లు నిర్మిస్తానని చెప్పారని అది పక్కనబెడితే ఉన్న స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైందని అమిత్ షా ధ్వజమెత్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆప్ సర్కార్ ఒక్క ప్రభుత్వ పాఠశాల భవనం కూడా నిర్మించలేదని అమిత్ షా విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఉన్న పాఠశాలల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా తయారైందని మండిపడ్డారు.

Home Minister Amit Shah Tweet

ఢిల్లీ రాష్ట్రంలోని 700 పాఠశాలలకు ప్రిన్సిపాల్‌లు లేరని చెప్పిన అమిత్ షా... 1000 స్కూళ్లల్లో సైన్స్ వింగ్ లేదని అన్నారు. అంతేకాదు 19000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా భర్తీ చేయలేదని వెల్లడించారు. కేజ్రీవాల్ విద్యకోసం కనీసం 30శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని అమిత్ షా ట్వీట్ చేశారు.

‘కేజ్రీవాల్‌ కా గ్యారెంటీ కార్డు’ను ఆవిష్కరించిన ఆప్ అధినేత

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీ కౌంటర్

అమిత్ షా చేసిన విమర్శలపై అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. విద్యను నీచరాజకీయాలతో అంటించరాదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విద్యార్థుల శ్రమను కించపరచరాదని చెబుతూ టీచర్లు, తల్లిదండ్రులు వారి ఉన్నతికి తోడ్పడుతున్నారని చెప్పారు. కేంద్రహోంమంత్రే స్వయంగా వచ్చి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చూడాలన్నారు. కొంత సమయం కేటాయించి తనతో వస్తే ఢిల్లీ స్కూళ్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అమిత్ షాకు చూపిస్తామన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ ఇదే 

Here's ANI Tweet

రోజంతా నెగిటివిటీతో ఉన్న అమిత్ షా... ఒక్కసారి ఢిల్లీ ప్రభుత్వ స్కూలు విద్యార్థులతో మాట్లాడితే కాస్త పాజిటివిటీ పెరుగుతుందని సూచించారు. ఇక బీజేపీలో ఉన్న సమయంలో మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న హర్‌శరణ్ సింగ్ బల్లి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు.

రెబెల్ ఎమ్మెల్యే అల్కా లంబాపై అనర్హత వేటు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ రూ. 3.4 కోట్లని తేలింది. 2015 లో ఇవి రూ. 2.1 కోట్లు కాగా.. ఆ తరువాత రూ. 1.3 కోట్లు పెరిగాయట. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన తన అఫిడవిట్ లో ఆయన ఈ విషయాలను వివరించారు. ఇక తన భార్య సునీత ఆస్తుల విలువ 2015 లో 15 లక్షలు ఉండగా.. ఈ సంవత్సరానికి అది రూ. 57 లక్షలకు పెరిగినట్టు ఆయన తెలిపారు. ఇందులో 32 లక్షల నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు వెల్లడించారు.

Delhi CM Road Show

మాజీ ఆప్ నేత, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఆస్తుల విలువ రూ. 2.8 కోట్లు. కాగా ఈ ఈ ఎన్నికల్లో అత్యంత ధనికుడైన ఆప్ నాయకుడు ధరమ్ పాల్ లక్రా.. తన ఆస్తుల విలువ రూ. 292 కోట్లని పేర్కొన్నారు. ఆయన తరువాత ప్రమీలా టోకస్ ఆస్తులు రూ. 80 కోట్లు, ధన్వతి చందెలా ఆస్తులు రూ. 55 కోట్లు, రాజ్ కుమారి ధిల్లాన్ ఆస్తులు రూ. 51 కోట్లని వెల్లడైంది.

70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు

ఫిబ్రవరి 8న 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (Delhi Assembly Elections 2020) జరగనున్నాయి.ఫలితాలు ఫివ్రబరి 11న వెలువడనున్నాయి. సీఏఏ విషయంలో ఆప్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఏఏ ఆధారంగా చేసుకుని ఆప్, కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేశాయి. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. బీజేపీ కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తోంది. ఎదురుదాడికి దిగుతోంది.