తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది.
ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్‌దే మళ్లీ గెలుపని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి ఇక్కడ రెండోసారి నిరాశేనని తెలిపాయి.
పీపుల్స్ పల్స్
మొత్తం స్థానాలు 90
బీజేపీ 29-39
కాంగ్రెస్ 54-64
ఇతరులు 2
ఇండియా టుడే
బీజేపీ 36-46
కాంగ్రెస్ 40-50
ఇతరులు 0-5
సీఎన్‌ఎన్ న్యూస్ 18
బీజేపీ 41
కాంగ్రెస్ 46
స్వతంత్రులు 3
జన్ కీ బాత్
బీజేపీ 34-45
కాంగ్రెస్ 42-53
ఇతరులు 0
ఏబీపీ సీ ఓటర్
బీజేపీ 36-48
కాంగ్రెస్ 41-53
ఇతరులు 0
ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్
బీజేపీ 30-40
కాంగ్రెస్ 46-56
ఇతరులు 0
దైనిక్ భాస్కర్
బీజేపీ 36-46
కాంగ్రెస్ 46-56
ఇతరులు 0