CM Uddhav Thackeray, his son Aditya Thackeray and NCP President Sharad Pawar (Photo Credits: IANS)

Mumbai, May 26: దేశంలో ఓ వైపు కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయాలు (Maharashtra Politics) రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు ఒకరినొకరుపై విమర్శలు సంధించుకుంటున్నారు. ముంబైలో కోవిడ్ 19 (Mumbai Covid 19) కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని టార్గెట్ చేశాయి. మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వంపై సందేహాలు వ్యక్తం చేసినందుకు శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ మంగళవారం ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం సాయంత్రం మాతోశ్రీలో సమావేశమై ఒకటిన్నర గంటలు పాటు చర్చలు జరిపినట్లు రౌత్ తెలియజేశారు.

ప్రభుత్వం బలంగా (Maharashtra 'Strong) ఉందని సంజయ్ రౌత్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు, "శరద్ పవార్ & సిఎం ఉద్ధవ్ థాకరే నిన్న సాయంత్రం మాతోశ్రీలో సమావేశమయ్యారు. ఇద్దరు నాయకులు ఒకటిన్నర గంటలు చర్చలు జరిపారు. ఎవరైనా ప్రభుత్వ స్థిరత్వం గురించి వార్తలు వ్యాప్తి చేస్తుంటే, వారు ఈ పరిపాలనను జీర్ణించుకోలేదనుకోవాలి. ఏదేమైనా ప్రభుత్వం గట్టిగా ఉంటుంది. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎండలు బాబోయ్ ఎండలు, మరో 3 రోజులు పాటు నిప్పుల వానలా ఎండ, ప్రజలెవరూ బయటికి రావొద్దని అధికారుల సూచన

మహారాష్ట్రలో మొత్తం కోవిడ్ 19 కేసులు 50 వేలు దాటగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోనే సగానికి పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు మరింత పదునుపెట్టింది. వైరస్‌ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీతో భేటీ కావడం, రాష్ట్రంలో పరిస్థితి అదుపులోదని రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ ఉద్ధేశ పూర్వకంగానే గవర్నర్‌తో మంతనాలు చేస్తోందని తెలుస్తోంది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఉద్ధవ్‌ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌లో మంత్రులు, నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే భినాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయక తప్పదని పవార్‌ సూచించగా.. వైరస్‌ను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ఒక్కటే మార్గమని ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతల ఒత్తిడి మేరకే ఆంక్షల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ప్రభుత్వంలో అసంతృప్తిని పసిగట్టిన బీజేపీ నేతలు సర్కార్‌కు పడేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో శరద్‌ పవార్‌ మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైరస్‌ కట్టడి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. భేటీ అనంతరం పవర్‌ మీడియా మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.