India-China Face-Off: చైనా ఆక్రమించకపోతే 20 మంది ఎలా అమరులయ్యారు? కేంద్రానికి సూటి ప్రశ్నను సంధించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నిజాలు దాస్తున్నదంటూ ఆరోపణలు
Congress President Sonia Gandhi and MP Rahul Gandhi (Photo Credits: PTI)

New Delhi, June 26: బార్డర్లో చైనా ఇండియా మధ్య వార్ (India-China Face-Off) నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కేంద్రాన్ని టార్గెట్ చేసింది. బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించింది. చైనా గనక భారత భూభాగాన్ని ఆక్రమించలేదన్న మాటే నిజమైతే.. 20 మంది భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో (Why Our Soldiers Were Martyred)చెప్పాలని కేంద్రానికి సూటి ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ సంధించింది. చైనాతో ఉన్న సరిహద్దులను కాపాడే విషయంలో కేంద్రం తప్పించుకోజాలదని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్కొన్నారు. సరిహద్దుల్లో నెత్తుటి ధారలపై స్పందించిన అమెరికా, అక్కడ అసలేం జరుగుతోంది, 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?

లడఖ్‌లో నెలకొన్న పరిస్థితిపై దేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గాల్వాన్‌ సంఘటనలో వీర మరణం పొందిన సైనికుల గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రచారంలో భాగంగా సోనియా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైనా గనక భారత భూభాగాన్ని ఆక్రమించలేదన్న మాటే నిజమైతే.. 20 మంది భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Sonia Gandhi Questions PM Narendra Modi on India-China Face-off

భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రకటించారని, అయితే... ఉపగ్రహ చిత్రాలను చూసిన నిపుణులు మాత్రం చైనా దళాలు చొరబడినట్లు పేర్కొన్నారని అన్నారు. లడఖ్ లో చైనా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని ఎప్పుడు, ఎలా తిరిగి తీసుకొస్తారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన

లడఖ్‌లో మన ప్రాదేశిక సమగ్రతను చైనా ఉల్లంఘిస్తోందా? సరిహద్దు వద్ద ఉన్న పరిస్థితిపై ప్రధాని దేశాన్ని విశ్వాసంలోకి తీసుకుంటారా?’’ అని సోనియా సూటిగానే నిలదీశారు. ఈ విషయంలో మాత్రం కేంద్రం భారత జవాన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని, అదే నిజమైన దేశ భక్తి అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

India Wants to Hear Truth, Rahul Gandhi Tells PM Modi

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) కూడా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా విమర్శలు చేశారు. శుక్రవారం ట్విట్టర్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ప్రధాని భయపడకుండా నిజం చెప్పాలని కోరారు. వీడియోలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ దేశం మొత్తం సైన్యం, ప్రభుత్వంతో ఐక్యంగా నిలుస్తుంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. కొద్ది రోజుల క్రితం మన ప్రధానమంత్రి ఎవరూ భారతదేశానికి రాలేదని, మన భూమిని ఎవరూ తీసుకోలేదని చెప్పారు.

కానీ ఈ చిత్రంలో ఉపగ్రహం కనిపించినట్లు మాజీ ఆర్మీ జనరల్‌ చెబుతున్నారన్నారు. చైనా మన భూమిని ఒకటి కాకుండా మూడు ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నట్లు లడఖ్‌ ప్రజలు చెబుతున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రధాని మీరు నిజం చెప్పాలి. భయపడాల్సిన అవసరం లేదని రాహుల్‌ అన్నారు. భూమి పోలేదని, కానీ చైనా ఆ భూమిని తీసుకుందని మీరు చెబితే.. చైనాకు ప్రయోజనం ఉంటుంది. మనం కలిసి పోరాడాలి అని అన్నారు. అదేవిధంగా అమరువీరులైన మన సైనికులకు ఆయుధాలు లేకుండా సరిహద్దుకు ఎందుకు పంపారో తెలియజేయాలని ప్రశ్నించారు.