fourth-phase-of-polling-in-jharkhand-for-15-assembly-seats (Photo-ANI)

Ranchi, December 15: జార్ఖండ్ (Jharkhand)రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగో విడత పోలింగ్ ( Jharkhand Assembly Elections 2019 Phase 4) ప్రశాంతంగా జరుగుతోంది. 15 అసెంబ్లీ స్థానాలకు (15-assembly-seats) పోలింగ్ జరుగుతుండగా.. మొత్తం 221 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇందులో 23 మంది మహిళలు. మొత్తం 47 లక్షల 85 వేల 009 ఓటర్లున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. కానీ..భద్రతా కారణాల మధ్య..జమువా, బోడర్, తుండి, దుమ్రి, గిరిధ్ స్థానాల్లో సాయంత్రం 3గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 81 సీట్లకు అయిదు విడతలుగా పోలింగ్ జరుగుతున్న విషయం విదితమే. నాలుగో విడతలో బొకారో, చందన్ కియారీ, ఝరియా, బాగ్‌మారా, నిర్సా స్థానాల్లో పోటీ రసవత్తరంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు, తొలి విడతలో 62.87 శాతం పోలింగ్ నమోదు

డిసెంబర్ 20న చివరి దశ పోలింగ్ (16 సీట్లకు) జరుగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 23న వెలువడనున్నాయి. జార్ఖండ్ కార్మిక శాఖ మంత్రి రాజ్ పాలివార్, రెవెన్యూ శాఖ మంత్రి అమర్ కుమార్ బౌరి, మధుపర్ స్థానం నుంచి పాలివార్ జేఎంఎం అభ్యర్థి హుస్సేన్ అన్సారీ, అమర్ కుమార్ బౌరి, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఏజేఎస్‌యూ ఉమాకాంత్ రజాక్, జరియా నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ సతీమణి రజిని సింగ్ పోటీ, జరియా నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి దివంగత నీరజ్ సింగ్ సతీమణి పూర్ణిమ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. నీరజ్ సింగ్ హత్య కేసులో ఆరోపణలతో ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

Prime Minister Narendra Modi Tweet

ఈ ఎన్నికల్లో మొత్తం 47,85,009 ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతుండగా అందులో 25,40,794 ఓటర్లు పురుషులు, 22,44,134 ఓటర్లు మహిళలు ఉన్నారు. ఇందులో 95795 మంది తొలి సారి ఓట్లు హక్కను వినియోగించుకోవడం గమనార్హం. మొత్తం 6,101 పోలింగ్ స్టేషన్లలో 587 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉండగా...405 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. నక్సల్ ప్రభావిత్ ప్రాంతాల్లోనే 546 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.

ANI Tweet

జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికల్లో పోటీ చేసే 221 మందిలో 60 మందికిపైగా కోటీశ్వరులే. అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.25 కోట్లు నాలుగో విడత పోలింగ్‌లో 75 అభ్యర్థులకు నేరచరిత, పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.

ANI Tweet

జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి పండగలాంటి ఎన్నికలో ఓటర్లు పాల్గొని.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నానంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.