Pinarayi Vijayan (Photo Credits: ANI)

Thiruvananthapuram, May 3: గడిచిన నాలుగు దశాబ్దాలుగా అధికార పార్టీ/కూటమికి రెండోసారి విజయం అనేది కలగానే మిగిలిపోయిన నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి చరిత్రను తిరగరాసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను (Kerala Assembly Elections Results 2021) నిజం చేస్తూ విపక్ష యూడీఎఫ్‌ కూటమిపై స్పష్టమైన మెజారిటీని సాధించింది.

ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్‌ (Left Democratic Front) కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందింది. సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan), ఆయన కేబినెట్‌ సహచరులు కేకే శైలజ, ఎంఎం మణి, ఏసీ మొయిదీన్, సురేంద్రన్, రామచంద్రన్, క్రిష్ణ కుట్టీ, టీపీ రామకృష్ణన్, చంద్రశేఖరన్‌ తదితరులు గెలుపొందారు.

ఇటీవల రాజీనామా చేసిన ఉన్నత విద్యా శాఖ మాజీ మంత్రి కేటీ జలీల్‌ కూడా తవనూర్‌ నుంచి గెలిచారు. అయితే ఫిషరీస్‌ మంత్రి మెర్సీకుట్టీ అమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థి పీసీ విష్ణునాథ్‌ చేతిలో ఓడిపోయారు. ప్రతిపక్ష నేతలు రమేశ్‌ చెన్నితల, మాజీ సీఎం ఊమెన్‌ చాందీ గెలుపొందారు. తన సమీప అభ్యర్థి అధికార సీపీఎం తరఫున పోటీ చేసిన సీ థామస్‌పై 9,044 ఓట్ల తేడాతో గెలుపొందారు.

దీదీ దెబ్బకు మూడు పార్టీలు అవుట్, బెంగాల్లో కనుమరుగైన కాంగ్రెస్, వామపక్షాలు, మోదీ షా ద్వయానికి పశ్చిమ బెంగాల్లో చుక్కెదురు, ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ హ్యాట్రిక్

ఎల్డీఎఫ్‌ విజయం అంత సులువుగా ఏమీ జరగలేదు. కేరళ నుంచి వామపక్షాలను తుడిచిపెడతామని యూడీఎఫ్, బీజేపీలు ప్రచారంలో హోరెత్తించాయి.ప్రభుత్వంపై వచ్చిన ఎన్నో ఆరోపణలు, మనీ లాండరింగ్‌ కేసులో పార్టీ మాజీ సెక్రటరీ బాలకృష్ణన్‌ కుమారుడిని అరెస్టు చేశారు. ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి తదితర సమస్యలను దాటుకుంటూ సీఎం పీఠం దక్కించుకుంది.

కేరళకు 2018 ఆగస్టులో వచ్చిన వరదలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అన్ని జిల్లాలోనూ.. 54 లక్షల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. 483 మంది మృతిచెందగా.. 140 మంది గల్లంతయ్యారు. ఆ సమయంలో ఆయన కంటిమీద కునుకు లేకుండా పరిస్థితులను పర్యవేక్షించారు. 3,274 పునరావాస కేంద్రాల్లో 10 లక్షల మందికి ఆసరా కల్పించారు. కోలుకోవడానికి ఐదారేళ్లు పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేసినా ఏడాదిలోనే పరిస్థితులను చక్కదిద్దగలిగారు.

ఇక గతేడాది సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పినరయి విజయన్‌కు తెలిసే జరిగిందంటూ కాంగ్రెస్‌ తీవ్రంగా ఎండగట్టింది. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌ అధికారి ఒకరు 1.9 లక్షల డాలర్లు (రూ.1.2 కోట్లు) ఒమన్‌లోని మస్కట్‌కు స్మగ్లింగ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి.

పదేళ్ల తరువాత ఉదయించిన సూర్యుడు, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్.., ప్రభావం చూపని అధికార పార్టీ అన్నాడీఎంకే, భారీ ఓటమిని మూటగట్టుకున్న కమల్ పార్టీ

విజయన్‌కు చాలా దగ్గరి వ్యక్తి, మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.శివశంకర్‌పై ఉన్న రెండు కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతోంది. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను.. మోదీ ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు తమపై దాడి చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తూ.. సానుభూతి పొందే ప్రయత్నం చేసింది.

నిఫా, కొవిడ్‌ మహమ్మారుల్ని పినరయి సర్కారు సమర్థంగా ఎదుర్కొంది. కొవిడ్‌ విషయంలో.. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దేశంలో మొట్టమొదటి కరొనో కేసు నమోదైంది కూడా ఇక్కడే. అయితే.. మరణాల రేటు మాత్రం చాలా తక్కువ. ఇందుకు కారణం.. కేరళ సర్కారు అందిస్తున్న వైద్యం. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోజుకు 140 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది.

కరోనాపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. అవగాహన పెంపొందించారు. ఫలితంగా.. కేసులు భారీగానే ఉంటున్నా.. రోజువారీ ఆక్సిజన్‌ అవసరం 54 టన్నులుగా ఉంది. దీంతో అదనపు ఆక్సిజన్‌ ఉన్న రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. కొవిడ్‌ నియంత్రణలో గత ఏడాది కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు దక్కడాన్ని బట్టి.. అక్కడ కొవిడ్‌ కేర్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు.. ఏడాది నుంచి ఉచితంగా 15 సరుకులతో కూడిన కిట్లను అందజేస్తున్నారు. ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతోంది.

తిరుపతిలో 2019 రికార్డు బ్రేక్, 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, ఫ్యాన్ ధాటికి రెండు, మూడు స్థానాలకే పరిమితం టీడీపీ, బీజేపీ-జనసేన

అలాగే మూడేళ్ల కింద శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళను అనుమతించే వివాదంతో కేరళ ప్రభుత్వం ఒకానొక సందర్భంలో తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ వివాదం అధికారపార్టీపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో తిరిగి అధికారంలోకి వస్తామా అని ఎల్డీఎఫ్‌ వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా విజయం వరిస్తుందని ఆశలు చిగురించాయి. అనుకున్నట్లుగానే విజయన్ పార్టీ ఘనవిజయాన్ని సాధించింది.

కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. గతంలో ఉన్న సిట్టింగ్‌ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ‘మెట్రోమ్యాన్‌’ఇ.శ్రీధరన్‌ కూడా గెలవలేకపోయారు. మిజోరం మాజీ గవర్నర్‌ కుమ్మనం రాజశేఖరన్‌ను బరిలో దింపగా, సీపీఎం అభ్యర్థి వి.శివకుట్టి చేతిలో పరాజయం చెందారు. మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ కొన్ని రౌండ్ల వరకు ఆధిక్యం కనబర్చినా.. చివరి క్షణంలో సీపీఎం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే షఫీ పారాంబిల్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ప్రకటించని బీజేపీ.. శ్రీధరన్‌ను తమ పార్టీ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం చేసిన సంగతి విదితమే.

సాగర్‌లో గులాబీ రెపరెపలు, నోముల భగత్ విజయం, రెండో స్థానంలో జానారెడ్డి, గల్లంతయిన బీజేపీ, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే

సినీ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ గోపీ బీజేపీ తరఫున బరిలో దిగారు. ఓట్ల లెక్కింపులో సురేశ్‌ ఆధిక్యం కనబర్చినా.. చివరి రౌండ్లతో ఫలితం తారుమారైంది. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్‌ కూడా కంజిరపల్లి స్థానం నుంచి ఓడిపోయారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

లవ్‌ జిహాద్, శబరిమల ఆలయంలోని మహిళల ప్రవేశం వంటి అంశాలను బీజేపీ తన అస్త్రాలుగా మార్చుకుని తీవ్రంగా ప్రచారం చేసింది. ఎల్డీఎఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగించింది. అయినా కేరళలో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తాజా ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది.

కేరళలో బీజేపీకి స్థానం లేదు : విజయన్

ఫలితాల అనంతరం పినరయి విజయన్ మీడియా4తో మాట్లాడారు. కేరళలో బీజేపీకి స్థానం లేదని, మతతత్వానికి తావు లేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఉద్ఘాటించారు. గత ఎన్నికల్లో పాగా వేసిన బీజేపీ నుంచి ఆ ఒక్క స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పైనా విరుచుకుపడ్డారు.

‘‘రాహుల్‌ పోరాటం చేయాల్సింది బీజేపీపై. కేరళలో మాపైన కాదు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు ప్రచారం చేస్తే బాగుంటుంది. బెంగాల్‌లో సీపీఎంతో కాగ్రె్‌సకు వింత పొత్తు ఉంది. కానీ కేరళలో కాదని గుర్తించాలి’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. విజయన్‌కు ప్రధాని మోదీ సహా పలువురు నేతలు అభినందనలు తెలిపారు. సీతారాం ఏచూరి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తదితరులు ఆయనకు అభినందనలు చెప్పిన వారిలో ఉన్నారు.