Bhopal, July 2: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తన మంత్రిమండలిని (Madhya Pradesh Cabinet Expansion)ఎట్టకేలకు విస్తరించారు. శివరాజ్‌సింగ్ సింగ్ (CM Shivraj Singh Chouhan) నేతృత్వంలోని ప్రభుత్వంలో గురువారం కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. భోపాల్‌లో ఈ రోజు ఉదయం 28 మందితో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో 20 మంది మంత్రులుగా, ఎనిమిది మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా మంత్రిమండలి విస్తరణ ( MP Cabinet Ministers) అంశం గత మూడు నెలలుగా వాయిదాపడుతూ వస్తున్నది. బల పరీక్షకు ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కమల్ నాథ్, మరో రాష్ట్రాన్ని బీజేపీ చేతిలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ
నూతన మంత్రివర్గంలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు కావడం విశేషం. కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన సింధియా తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో తన వర్గీయులకు పదవులు దక్కించుకోవడంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో సింధియా వర్గంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రధుమాన్ సింగ్ తోమర్‌తో పాటు సిందియా అత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సింధియాలు ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు. సింధియా దెబ్బకు కాంగ్రెస్ విలవిల, కూలి కమల్ నాథ్ సర్కార్, రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా, పార్టీల బలబలాలు ఇవే
కమల్‌నాథ్‌తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు. బీజేపీ గూటికి 22 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
అయితే రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్ విస్తరణ ఇన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్నది. దీనికి తోడు లాక్‌డౌన్ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా గురువారం 28 మంది మంత్రులు ప్రమాణం చేయడంతో శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో పూర్తి కేబినెట్ కొలువు దీరినట్లయింది.