MP Political Turmoil: సింధియా దెబ్బకు కాంగ్రెస్ విలవిల, కూలుతున్న కమల్ నాథ్ సర్కార్, రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా, పార్టీల బలబలాలు ఇవే
Kamal Nath - Jyotiraditya Scindia (Photo Credits: Facebook)

Bhopal, March 10: మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు (MP Political Turmoil) శరవేగంగా మారిపోతున్నాయి. కమల్ నాథ్ సర్కార్ ను (CM Kamal Nath) కూల్చడమే లక్ష్యంగా అక్కడి రాజకీయాలు ఊపందుకున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.

ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా

సింధియా (Jyotiraditya Scindia) రాజీనామా చేసిన వెంటనే 20మంది ఎమ్మెల్యేలు తమ పదవి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230. అయితే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే మృతి చెందడంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 228కి చేరింది. కాంగ్రెస్‌ 114, బీజేపీ 107, స్వతంత్రులు 4, బీఎస్పీ 2, ఎస్పీ ఒక ఎమ్మెల్యే బలం కలిగిఉంది. కాంగ్రెస్‌కి స్వతంత్రులు, మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్, కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా

ఇప్పుడు 20మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో (Madhya Pradesh Government Crisis) పడింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కే మధ్యప్రదేశ్‌ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది రాజీనామా చేయడంతో సభలో సభ్యుల సంఖ్య  220 నుంచి 213కి చేరుతోంది. అంటే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 106 అవుతోంది. కాంగ్రెస్ పార్టీ 114 సీట్ల నుంచి 94కి పడిపోగా.. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోంది. 107 మంది సభ్యులతో ఉన్న బీజేపీ 20 మందిని చేర్చుకోవడం ద్వారా అధికారం చేపట్టేందుకు సిధ్దంగా ఉంది.

గవర్నర్ విచక్షణ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తే.. కమలదళం 15 నెలల తర్వాత అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఎస్పీ, బీఎస్సీ ముగ్గురు సభ్యులు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. బీజేపీకి కలిగే ప్రయోజనం ఉండదు. ఇండిపెండెంట్లను కూడా క్రమంగా బీజేపీ తమ వైపునకు తిప్పుకునే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన బీఎస్‌పీ, ఎస్‌పీ ఎమ్మెల్యేలు తాజాగా మంగళవారం మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి వచ్చారు. బీఎస్‌పీ ఎమ్మెల్యే సంజీవ్ కుష్వాహ్, ఎస్‌పీ ఎమ్మెల్యే రాజేశ్ శుక్లా మంగళవారం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి వెళ్ళారు.

సంక్షోభంపై షాకిచ్చిన కమల్ నాథ్ సర్కార్

పలు నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి మంగళవారంనాడు రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా సాయంత్రం 6 గంటలకు బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మోదీ సర్కార్ చోటు కల్పించే అవకాశాలున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.

అవిశ్వాస తీర్మానపు వ్యూహంలో బీజేపీ, అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ సీఎం  కమల్‌ నాథ్

జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారంనాడు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సింధియా బహిష్కరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేసినట్టు పార్టీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఆ ప్రకటనలో తెలిపారు.

కాగా మధ్యప్రదేశ్ లో మూడురాజ్యసభ సీట్లున్నాయి. అందులో రెండింటిని కాంగ్రెస్ గెల్చుకొనేలా ఉంది. మారిన సమీకరణాలతో ఈ పరిస్థితి తల్లక్రిందులైంది. ఈరోజు సమావేశమైయ్యే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్ధులను ప్రకటించనుంది. సింధియాకు రాజ్యసభ టిక్కెట్ గ్యారంటీ అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.