PM Modi Gets Emotional: రాజ్యసభలో ప్రధాని మోదీ కంటతడి, ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడంటూ భావోద్వేగం, ఈ నెల 15తో ముగియనున్న గులాం నబీ ఆజాద్ పదవీ కాలం, రాజ్యసభకు మళ్లీ మేము నామినేట్ చేప్తామని తెలిపిన అథవాలే
PM Narendra Modi bids emotional farewell (Photo Credits: ANI)

New Delhi, February 9: పదవీ విరమణ చేస్తున్న ఎంపీలకు భావోద్వేగ వీడ్కోలు చెప్పేందుకు మంగళవారంనాడు రాజ్యసభ వేదికైంది. కాగా ఫిబ్రవరి 15తో ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి (PM Modi Gets Emotional) పెట్టుకున్నారు.

ఆజాద్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్నత పదవులు వస్తుంటాయి. అధికారమూ వస్తుంది. ఇన్ని వచ్చినా, ఎలా వుండాలో ఆజాద్ (Congress Leader Ghulam Nabi Azad) దగ్గర నేర్చుకోవాలి. ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు.’’ అంటూ మోదీ ఉద్వేగానికి గురయ్యారు.

గులాం నబీ ఆజాద్ వీడ్కోలు (Azad's Farewell) సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘‘గుజరాతీ పర్యాటకులపై కశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు ఆజాద్ నాకు ఫోన్ చేశారు. బాధపడుతూ ఏడ్చేశారు. నేరుగా విమానాశ్రయానికే వచ్చేశారు. ఓ కుటుంబ సభ్యుడిగా వారందర్నీ చూసుకున్నారు. బాధితులపై శ్రద్ధ చూపారు. ఆ సమయంలో ప్రణబ్ దాదా రక్షణ మంత్రిగా ఉన్నారు. మృత దేహాన్ని తరలించడానికి ఓ ఏయిర్ ఫోర్స్ విమానం కావాలని అడిగా. ఏదో ఒకటి కచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు.

Watch video of teary-eyed Narendra Modi bidding farewell to Gulam Nabi Azad:

రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆజాద్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు. దేశం కోసం వారిచ్చే సూచనలు, సలహాలను ఎప్పటికీ స్వాగతిస్తూనే ఉంటాం.’’ అంటూ ఆజాద్‌కు మోదీ సెల్యూట్ చేశారు. గులాంనబీ ఆజాద్ కేవలం పార్టీ కోసమే ఆలోచించలేదని, దేశం కోసం కూడా ఆలోచించారని ప్రశంసించారు. ఆయన దేశానికి చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చేవారని, శరద్ పవార్ కూడా అచ్చు ఇలాగే ఉండేవారని మోదీ వ్యాఖ్యానించారు.

ఆజాద్ తర్వాత ఆ సీట్లో ఎవరు కూర్చున్నా, చాలా సవాళ్లను స్వీకరించాల్సి ఉంటుందని మోదీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ నుంచి ఢిల్లీ వరకూ సాగిన తన రాజకీయ ప్రస్థానాన్ని తలుచుకుంటూ, సభను ఎలా నడపాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి నేర్చుకున్నానని అన్నారు. సభలో ప్రతిష్ఠంభనను ఎలా తొలగించాలి, ఎలా సభను నడపాలనేది ఆజాద్ నుంచే నేర్చుకున్నట్టు చెప్పారు.

రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్ధతు, అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం, కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ, డేట్ చెబితే చర్చలకు వస్తామని తెలిపిన రైతు సంఘాల నాయకులు

హిందుస్థానీ ముస్లింగా తాను గర్విస్తున్నానని ఆజాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'నేను ఒక్కసారి కూడా పాకిస్థాన్ వెళ్లలేదు. నేను ఆ మేరకు అదృష్టవంతుడిని. పాకిస్థాన్‌లో పరిస్థితులను తెలుసుకున్నప్పుడు, హిందుస్థాన్ ముస్లింగా నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను' అని ఆజాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లోనే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేయనున్న ఆజాద్‌కు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు.

సూప‌ర్ బౌల్‌లో మన దేశ రైతుల ఆందోళన యాడ్, మార్టిన్ లూథ‌ర్ కింగ్ జూనియ‌ర్ మాటలతో 30 సెక‌న్ల యాడ్, చరిత్రలో సుదీర్ఘ పోరాటమంటూ ప్రారంభం, నిధులు సమకూర్చిన సెంట్రల్ వ్యాలీ సిక్కు సంఘం

మీరు కచ్చితంగా మళ్లీ సభలోకి ప్రవేశించాలి. కాంగ్రెస్ మిమ్మల్ని నామినేట్ చేయకపోతే, మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేయడానికి మేం సిద్ధమే. రాజ్యసభకు మీ అవసరం ఉంది.’’ అని అథవాలే ఆజాద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా గులాంనబీ ఆజాద్ వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 15 తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది.